జాతీయంవార్తలు

Union Budget 2022 Highlights: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ వల్ల రైతులకు తక్కువ ధరకే ఎరువులు

1
Union Budget 2022 Highlights

Union Budget 2022 Highlights: వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో స్వల్పంగా పెంచింది. 2021-22 సంవత్సరంలో రూ.1,47,764 కోట్లు ఉండగా…ఈ ఏడాది రూ.1,51,521 కోట్లకు పెంచారు. మరోవైపు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి బడ్జెట్ కేటాయింపులో స్వల్ప పెరుగుదల కనిపించింది. దీని కోసం 2021-22లో 65000 కోట్లు కేటాయించగా, 2022-2023కి రూ.68000 కోట్లకు పెంచారు.

nirmala sitaraman

మరోవైపు ఫసల్ బీమా పథకానికి రూ.15500 కోట్లు కేటాయించారు. ఎరువులకు సబ్సిడీగా 2022-23లో రూ.105222 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందే మార్గం సుగమమవుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించలేదు. అంటే ఎరువుల కంపెనీలకు ఈ మొత్తం సబ్సిడీ ఇవ్వనుంది. నిజానికి 2013-14 సంవత్సరంలో వ్యవసాయ శాఖకు బడ్జెట్‌లో రూ.21,933.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు దానికంటే మూడు రెట్లు ఎక్కువ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ అవుతోంది.

agriculture

పీఎం కిసాన్ పథకం మరియు దాని బడ్జెట్:
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మొదటి బడ్జెట్ కేటాయింపు రూ.75000 కోట్లు. కానీ 2021-2022 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు తగ్గించి రూ.65000 కోట్లకు చేర్చింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎందుకంటే పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 75000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం 2022-2023 సంవత్సరానికి 68000 కోట్ల రూపాయలకు బడ్జెట్ కేటాయింపులు చేసింది.

Union Budget 2022 Highlights

పీఎం కిసాన్ బడ్జెట్ పెంపు వల్ల రైతులకు ప్రయోజనం లేదు:
అయితే పీఎం కిసాన్‌ నిధి బడ్జెట్‌ పెంపు కూడా రైతులపై ఎటువంటి ప్రభావం చూపడం లేదు. ఎందుకంటే రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు మాత్రమే వస్తుంది. బడ్జెట్ కేటాయింపులు పెరగడం వల్ల ఏటా రూ.6000 కంటే ఎక్కువ మొత్తం ప్రభుత్వం ఇవ్వదని స్పష్టం. ఇక పీఎం కిసాన్ యోజనలో దాదాపు 11 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.

Leave Your Comments

Farmer Success Story: ఆధునిక పద్ధతిలో టమోటాలు పండిస్తూ లక్షల్లో సంపాదిస్తున్న పోలీస్

Previous article

Railway Budget 2022 Highlights: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైల్వే కొత్త ప్లాన్ ఇదే

Next article

You may also like