తెలంగాణవార్తలు

Nature of Agriculture: దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలి- నిరంజన్ రెడ్డి

2
Niranjan Reddy
Niranjan Reddy

Nature of Agriculture: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన “అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు”లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు హాజరయ్యారు.

Niranjan Reddy

Niranjan Reddy

దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలి,యాంత్రీకరణ, సాంకేతికతను సంపూర్ణంగా అమలు చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు”లో వ్యాఖ్యానించారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికతతో యువతకు ఉపాధి లభించాలి నిరంజన్ రెడ్డి గారు అభిలాషించారు.

దీనిమూలంగా వ్యవసాయరంగంలో యాంత్రీకరణ అందుబాటులోకి రావడమే కాకుండా, రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ను కోరడం జరుగుతున్నది. ఈ ప్రయత్నం ఫలప్రదమయితే తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా పత్తి పండించే రైతులకు మేలు చేకూరుతుందని అన్నారు. సాగులో నూతన శకానికి నాంది పలికాం.. సాంప్రదాయ సాగునుండి ప్రపంచ సాంకేతికతను తెలంగాణ వ్యవసాయానికి అన్వయించుకోవాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అన్నారు. మనకున్న వ్యవసాయాన్ని ఉజ్వలమైన వ్యవసాయంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అని పేర్కొన్నారు.

Also Read: Eruvaka Purnima: ఏరువాక పూర్ణిమ విశిష్టత ఏంటో తెలుసా.!

కేవలం అధిక మోతాదులో పంటలు పండించడమే కాదు. అవసరమైన పంటలు, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, రైతుకు రాబడినిచ్చే పంటలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం పెంచేలా తెలంగాణ వ్యవసాయం ముందుకుసాగాలని తెలిపారు.

మూడేళ్లుగా రైతులను అప్రమత్తం చేస్తున్నాం. జిల్లాల వారీగా సదస్సులతో ఏ పంటలు వేయాలి అన్న విషయాన్ని రైతులకు వివరించాం. రైతులు కూడా పంటల వైవిద్యీకరణకు సానుకూలంగా ఉన్నారు. ప్రపంచ అవసరాలకు సరిపడా పత్తి ఉత్పత్తి కావడం లేదు. ప్రపంచంలో పత్తి అత్యధికంగా సాగయ్యేది భారతదేశంలోనే అని చెప్పారు.

3.20 కోట్ల ఎకరాలలో దేశంలో పత్తి సాగు అవుతున్నది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాలలో తెలంగాణ, గుజరాత్ లు ఉన్నాయి. చైనాలో 80 లక్షల ఎకరాలలో, అమెరికాలో 75 నుండి 80 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతున్నది. బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో 18 నుండి 50 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతున్నది. అయితే చైనాలో 80 లక్షల ఎకరాలలోనే మనకన్నా మూడింతల ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు.ఉత్పాదకత విషయంలో మన దేశం వెనకబడి ఉంది.

Workshop on HDPS - Cotton

Workshop on HDPS – Cotton

ప్రపంచ సాంకేతికతను అందిపుచ్చుకుని ఉంటే 3.20 కోట్ల ఎకరాలలో పత్తి సాగుతో ప్రపంచ అవసరాలను పూర్తిగా మనమే తీర్చే అవకాశం ఉన్నది. బయటి దేశాలలో పెద్ద, పెద్ద భూ కమతాలు ఉండడం మూలంగా వారు వ్యవసాయ యాంత్రీకరణను సులువుగా అమలు చేసుకోగలుగుతున్నారు. మన దేశంలో చిన్న, చిన్న భూకమతాలు యాంత్రీకరణకు ఖర్చుతో కూడినవిగా వుంటున్నవి.

సింగిల్ పిక్ పత్తి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి. అదే సమయంలో రైతుల భూములు అధిక సాంధ్రత పత్తి సాగుకు అనుకూలమా ? లేదా ? అన్నది నిర్ణయించుకోవాలి. అధికసాంధ్రత పత్తి సాగు మూలంగా భూమి వ్యర్థం కాకపోవడం, సాగునీరు వృధా కాకపోవడంతో పాటు కూలీల ఇబ్బంది కూడా ఉండదు. పత్తి పంట సాగును ప్రోత్సహించే క్రమంలో దానికి అనుకూలమైన రైతులను మాత్రమే ప్రోత్సహించాలి. అత్యధిక ఉత్పాదకతను సాధించినప్పుడే మన ప్రయత్నం విజయవంతం అయినట్లు అని నిరంజన్ రెడ్డి గారు మాట్లాడారు.

జులై 15 వరకు పత్తి సాగుకు అవకాశం ఉంది. భూమి చల్లబడక ముందే విత్తనాలను నాటడం మూలంగా విత్తనం ఉడికి ఇబ్బందులు వస్తాయి. మొదటి వానకు కాకుండా రెండో వాన తర్వాతనే పత్తి సాగుకు సిద్దం కావాలి. అధికసాంద్రత పత్తి సాగులో తెలంగాణ దేశానికి తలమానికం కావాలి. భవిష్యత్ లో రాష్ట్రంలో ప్రతి పంట సాగు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం జరగాలి.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిడోరియంలో నిర్వహించిన “అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు”లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు గారు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్ గారు పాల్గొన్నారు.

Also Reasd: Focus On Organic Farming: సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టండి- ఉప రాష్ట్రపతి

Leave Your Comments

Eruvaka Purnima: ఏరువాక పూర్ణిమ విశిష్టత ఏంటో తెలుసా.!

Previous article

Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

Next article

You may also like