TRS MP Nama Nageswara Rao Questions On Paddy Procurement యాసంగి వడ్లు కొనుగోలుపై పార్లమెంట్ సాక్షిగా తెరాస బీజేపీ ల మధ్య వార్ నడుస్తుంది. యసంది వడ్లు కొనేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. అటు రాష్ట్ర నాయకత్వం కూడా ఈ ఏడాది యాసంగి పంట కొనుగోలు కేంద్రాలు ఉండవని పేర్కొంది. కాగా పార్లమెంటులో తెరాస ఎంపీలు రైతుల సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. నేడు పార్లమెంటులో అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో ఎంపీ నామ నాగేశ్వర రావు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ చెప్పారు. ముఖ్యంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ద్వారా ఎకరానికి 10 వేలు ఇస్తున్నట్టు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో లాభం పొందుతున్నారని, ఎక్కువ శాతం పంట దిగుబడి పెరిగిందని నామా తెలిపారు. వరి ఉత్పత్తిలో ఇండియాలో నెంబర్ వన్ అయ్యామన్నారు. దాని వల్ల వరి సేకరణ సమస్య ఏర్పడిందన్నారు. తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు పంట వేస్తారని నామ నాగేశ్వర రావు అన్నారు. TRS MP Nama Nageswara Rao
Paddy Procurement ధాన్యం కొనుగోలులో కేంద్రం రెండు నాలుక ధోరణి ప్రదర్శిస్తుందని, ఒకసారి పంట కొనుగోలు చేస్తామని, మరొకసారి కొనే ప్రసక్తే లేదని కేంద్రం అంటుందని నామ అన్నారు. ఎఫ్‌సీఐకి కోటా ఇవ్వడంలేదన్నారు. ధాన్యం విషయంలో తెలంగాణ రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. రైతులు రోడ్డునపడ్డారని, అందులో భాగంగా రైతు బాగు కోసం తెరాస ప్రభుత్వం కేంద్రంతో పలు మార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేదని అన్నారు. అయితే ఏడాదికి ఎంత వరిని ప్రొక్యూర్ చేస్తారో చెప్పాలని పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందని, కరోనా సమయంలో తిండి పెట్టింది రైతులే అని ఆయన అన్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, దేశం రైతాంగం కోసం జాతీయ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తీసుకురావాలని నామా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు లీగల్ రైట్ తీసుకురావాలని కోరారు.