పండుగల ప్రభావం మనపై ఎంతో ఉంటుంది. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లడం, సరదాగా గడపడం ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ముఖ్యంగా కొన్ని పండుగలకు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ అభిమానాన్ని చాటుకుంటాము. రక్షాబంధన్, దీపావళి ఫెస్టివల్స్ కి విలువైన బహుమతులతో వారి మోములో ఆనందాన్ని నింపుతుంటారు కొందరు. అయితే గిఫ్ట్ అంటే విలువైనదే కానక్కర్లేదు సంప్రదాయంగా ఉండేలా బహుమతులు ఇస్తే ఎప్పటికి గుర్తుండిపోతుంది. అందునా దీపావళి ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైనది.సో ఇవి బహుమతిగా ఇవ్వడం వల్ల బహుమతి ఇచ్చినట్లు ఉంటుంది అలాగే పర్యావరణాన్ని పెంచినట్లు ఉంటుంది.
ఈ గిఫ్ట్‌లు ఇచ్చారంటే మీ మధుర బంధం చిరకాలం నిలిచిపోతుంది. మనకి ఇష్టం అయిన వారికి ప్రేమతో ఒక మొక్కని బహుమతిగా ఇస్తే ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు ఆ బహుమతి చూస్తున్నప్పుడు మనల్ని అది గుర్తు చేస్తోంది. మరికొందరికి ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండొచ్చు.మీ స్నేహితులకు ఇష్టమైన పండ్లను కొనుగోలు చేసి ప్రత్యేకంగా తయారుచేసిన బుట్టలో అందంగా అలంకరించి గిఫ్టులుగా ఇవ్వొచ్చు. చాలా స్పెషల్ గా కూడా ఉంటుంది. మొక్కలు పండ్లు కాదనుకుంటే మరింత ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ ని కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. పైగా వాటిని అస్సలు కాదనరు కూడా. ఇలా పర్యావరణాన్ని పెంచే విధంగా బహుమతులు ఇవ్వడం అనేది రేపటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది.
#DiwaliGifts #TraditionalGifting #eruvaaka #giftaplant