తెలంగాణవార్తలు

అగ్రి ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు మలేషియా వ్యవసాయ మంత్రిని కోరిన తుమ్మల

0
Agri Processing : మూడోరోజు పర్యటనలో…  
అగ్రి ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు పెట్టుబడులతో రావాలని 
మలేషియా వ్యవసాయ మంత్రిని కోరిన తుమ్మల
మలేషియా పర్యటనలో భాగంగా మూడవ రోజు (అక్టోబర్ 25 న) మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మలేషియా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.  మలేషియా దేశ వ్యవసాయ మంత్రి మహ్మద్ బిన్ సాబుతో వారి కార్యాలయంలో సమావేశమై పలువిషయాలను చర్చించారు. తెలంగాణాలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పడానికి, పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా వారిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాధించిన వృద్ధిని వివరించి, తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అగ్రిప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి అనుకూల వాతావరణం ఉందని, కావున తమ రాష్ట్రంలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి, రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరగా, అందుకు మలేషియా మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే ఫెల్డా చైర్మన్ అహ్మద్ షబేరీ చీక్, వారి ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమై ఆయిల్ పాం రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. తమ రాష్ట్ర ఆయిల్ పాం రైతులకు ప్రయోజనకరంగా ఉండే పద్దతులపై చర్చించారు. అంతేగాకుండా మలేషియాలో భారత హై కమిషన్ బి.ఎన్. రెడ్డి ఆహ్వానం మేరకు వారి ఆథిత్యాన్ని స్వీకరించి, వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
  • తెనాషియా ప్రైవేట్ లిమిటెడ్ (palmpro) కంపెనీని సందర్శించి, యాంత్రీకరణకు సంబంధించి అక్కడ వివిధ రకాల యంత్రాలు, పనిముట్లు, వాటి  పనివిధానాన్ని మంత్రి తుమ్మల అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
టేనర్ కంపెనీలో గెలలు ఉడకబెట్టడంపై పరిశీలన:
వెర్టికల్ స్టెరిలైజర్, హారిజాంటల్ స్టెరిలైజర్ ల వ్యత్యాసం కోసం మలేషియాలోని టేనర్(taner) కంపెనీలో పరిశీలించారు. పదేళ్ల క్రితం వర్టికల్ స్టెరిలైజర్ లో గెలలను ఉడకబెట్టే పద్ధతిలో ఉన్నసమస్యలను మార్పు చేయడం వల్ల అంతకుముందున్న అవరోధాలను తొలగించి ఇప్పుడు వచ్చిన అధునాతన వర్టికల్ స్టెరిలైజర్ లోఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేట్ (ఓ.ఇ.ఆర్), ఇతర ప్రాసెసింగ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తున్నారు. వర్టికల్ స్టెరిలైజర్ లో రెగ్యులేట్ స్పీడ్ లో మిల్ నడపడం, తక్కువ లేబర్, ఎక్కువ సేఫ్టీ, తక్కువ ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు కట్టే అన్నీ పామ్ ఆయిల్ మిల్స్ లో వర్టికల్ స్టెరిలైజర్ ని మాత్రమే వాడుతున్నారు. రెండు పద్ధతులలో ఓ.ఇ.ఆర్  సరిసమానంగా ఉంటాయి అని టేనర్ కంపెనీ ప్రతినిధులు విశదీకరించారు.
Leave Your Comments

పత్తి కొనుగోళ్ళకు వాట్స్ యాప్ సేవలు ప్రారంభం

Previous article

ఆన్ లైన్ విధానంలో ఉల్లి విక్రయాలు పునరుద్ధరణ

Next article

You may also like