ఆరోగ్యం / జీవన విధానంవార్తలు

పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలి అనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సినవి..

0

ప్రాచీన కాలం నుంచి మానవులు తమ ఆహారంగా అనేకరకాల చిరు ధాన్యాలను ఉపయోగిస్తూ ఎంతో ఆరోగ్యంగా వున్నారు. ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో మారుతున్న కాలానుగుణంగా ఆహారంలో మార్పులు సంతరించుకున్నాయి. ప్రస్తుతం మనం ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడి అనేక వ్యాధులతో నిత్యం పోరాడుతూనే ఉన్నాం. చిరుధాన్యాలంటే చాలా మందికి చిన్న చూపు, చిరుధాన్యాలలో బి.కాంప్లెక్స్, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. చిరుధాన్యాలలో 3/4వ వంతు పిండిపదార్థాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.

కొర్రలు:

వీటిని ఆహారంలో తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన మాంసకృతులు సమృద్ధిగా అందుతాయి. కొర్రలలో అధిక పీచుపదార్థం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో నరాల బలహీనత, మధుమేహ వ్యాధిగస్ధులకిది మంచి ఆహారం. శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది.

అరికెలు:

విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు రక్తహీనతను తగ్గిస్తుంది మరియు మలబద్దకాన్ని దూరం చేస్తుంది. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టీవిటీ కలిగి ఉండి రక్తంలో చక్కెర , కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఊదలు:

రుచికి తీయగా ఉంటాయి. బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది. ఇవి ఎక్కువగా లివర్ సమస్య నుండి కిడ్నీల సమస్య నుండి కాపాడుతుంది. అలాగే గ్యాస్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహారం.

అండుకొర్రలు:

వీటిని కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. జీర్ణాశయం, ఆర్ద్రయీటిస్, బి.పి., థైరాయిడ్, కంటి సమస్యలు ఊబకాయం నివారణకు ఉపయోగపడతాయి.

Leave Your Comments

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..ఒకేసారి రూ. 18 వేలు

Previous article

రాష్ట్రంలో కందికి డిమాండ్..

Next article

You may also like