వార్తలు

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోంది – PJTSAU ఉపకులపతి ప్రవీణ్ రావు

0
pjtsau praveen Rao

pjtsau praveen Rao

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోంది ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. తదనగుణంగా వాటి సాగు విస్తీర్ణం పెరగవలసిన అవసరముందన్నారు. గురువారం ఉపకులపతి ఛాంబర్ లో పిజెటిఎస్ఎయు, అమ్యూస్ (AMUSE) ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ల మధ్య అవగాహనా ఒప్పంద కార్యక్రమం జరిగింది. వర్సిటీ అభివృద్ధి చేసిన ‘తెలంగాణ సోనా’ మార్కెటింగ్ కోసం ఈ ఒప్పందం కుదిరింది. వర్సిటీ తరపున పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, అమ్యూస్ తరపున వంశీకృష్ణ ఒప్పందాలు పరస్పరం మార్చుకున్నారు. చక్కెర స్థాయిల్ని తగ్గించడానికి ఉపకరించే తెలంగాణ సోనాకు ప్రజలలో మంచి ఆదరణ లభిస్తోందని ప్రవీణ్ రావు అన్నారు. ఈ బియ్యం వినియోగాన్ని ప్రజల్లోకి, గ్రామీణ ప్రాంతాలకి మరింత చేరువ చేయాలని ఆయన సూచించారు. సంస్థలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకి మంచి ధర లభించడంతోపాటు, వినియోగదారులకి నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందుతాయని ప్రవీణ్ రావు అన్నారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయం అందిస్తుందని తెలిపారు. నాణ్యతతో కూడిన శుభ్రమైన ఆహార ఉత్పత్తులపై నేడు, పల్లె, పట్టణ ప్రాంతాల్లోనూ అవగాహన పెరిగిందని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

 

Also Read : రోబో రైతులు… 

Leave Your Comments

రోబో రైతులు…

Previous article

వెదురు పిలకల కూర అద్భుతం

Next article

You may also like