తెలంగాణవార్తలు

PJTSAU: ముగిసిన “ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్” కార్యక్రమం

1
Flame of Entrepreneurship
Flame of Entrepreneurship

PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆడిటోరియంలో Flame of entrepreneur ship కార్యక్రమం జరిగింది. ‘ది ఎమర్జన్స్ ఆఫ్ అగ్రిటెక్ ఇన్నోవేషన్స్ ఇన్ టూ అగ్రి ఫుడ్ సిస్టమ్స్’ అన్న అంశంపై ఈ సదస్సు జరిగింది. జూన్ 28వ తేదీన T-hub రెండో విడత ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత సదస్సును ఉద్దేశించి నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సోమసుందరం ప్రసంగించారు. నాబార్డ్ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అగ్రి స్టార్టప్ లని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.

Flame of Entrepreneurship

Flame of Entrepreneurship

PJTSAU ఆధ్వర్యంలో అగ్రి హబ్ ఏర్పాటు కి నాబార్డు తోడ్పాటు అందించిందన్నారు. విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎదగాలన్నారు. పక్కా ప్రణాళిక, కఠోరశ్రమ, స్మార్ట్ గా పనిచేసే పద్ధతి నేర్చుకోవాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ముందుకు వెళ్లాలని సోమసుందరం సూచించారు. తెలంగాణ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ దిశగా సాగుతుందని RICH (రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్) డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ అన్నారు.

Also Read: TS Agri Minister Niranjan Reddy: ప్రధానమంత్రి కిసాన్ ‘ఘాఠా‘ యోజన -నిరంజన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కి అధిక ప్రోత్సహం ఇస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో ఇన్నోవేషన్ కి అపార అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా ఆలోచించాలని రంగ్నేకర్ సూచించారు. PJTSAU పరిధిలో Ag-hub ఏర్పాటుకి పూర్తి తోడ్పాటునందించిన నాబార్డ్ కి PJTSAU ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు సభా ముఖంగా దన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత తరానికి టెక్నాలజీ నిత్య జీవితంలో విడదీయరాని భాగం అయిందన్నారు. టెక్నాలజీ కారణంగానే మనమందరం విశ్వంతో అనుసంధానం కాగలిగామన్నారు. ఆధార్, మొబైల్ ఫోన్లు అనేవి అద్భుత ఆవిష్కరణలని అని ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. 60 శాతం జనాభా ప్రత్యక్షంగానూ, 40 శాతం జనాభా పరోక్షంగానూ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని ప్రవీణ్ రావు వివరించారు.

Flame of Entrepreneurship in PJTSAU

Flame of Entrepreneurship in PJTSAU

వ్యవసాయరంగంలో టెక్నాలజీలకి మంచి అవకాశముందన్నారు. వాతావరణ మార్పుల వల్ల నేడు వ్యవసాయ రంగం అనేక సవాళ్లని ఎదుర్కొంటుoదన్నారు. డ్రోన్లు, సెన్సర్లు, రిమోట్ సెన్సింగ్ వంటి అధునాతన టెక్నాలజీలతో వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించవచ్చని ప్రవీణ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన సాగునీటి సదుపాయాన్ని పెద్ద ఎత్తున కల్పిస్తుందన్నారు. అయితే ఇటువంటి నీటి వనరుల సమర్థ యాజమాన్యాయానికి టెక్నాలజీలు తోడ్పడతాయని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీలని బాగా ప్రోత్సహిస్తుందని ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో స్మార్ట్ వ్యవసాయం వైపు సాగాల్సిన అవసరముందని ప్రవీణ్ రావు అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్ కుమార్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ సీమ, అగ్రి హబ్ CEO ఎన్. విజయ్ తొ పాటు టి-హుబ్, రిచ్ ప్రతినిధులు PJTSAU పరిధిలోని తొమ్మిది వ్యవసాయ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధ్యార్థులు ఆడిటోరియం సమీపం లో టార్ఛ్ రన్ నిర్వహించారు.

Also Read: Agriculture in British Era: బ్రిటిష్ వ్యవస్థలో వ్యవసాయం ఇలా ఉండేది.!

Leave Your Comments

TS Agri Minister Niranjan Reddy: ప్రధానమంత్రి కిసాన్ ‘ఘాఠా‘ యోజన -నిరంజన్ రెడ్డి

Previous article

Rythu Bandhu: ఈ నెల 28 నుండి 9వ విడత రైతుబంధు సాయం

Next article

You may also like