వార్తలు

ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం..

0

ఏపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా 52.38 లక్షల మంది రైతులకు రూ. 3,882.23 కోట్లు రైతు భరోసా సాయం అందించనున్నారు. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్సార్ రైతు భరోసా సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. ఇది మూడు విడతలుగా ఇవ్వనున్న ప్రభుత్వం. మొదటి విడతలో ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ. 7,500, రెండవ విడతగా అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతలో ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ, జనవరి నెలలో రూ. 2,000 జమ చేయనుంది.
కరోనా నేపథ్యంలో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కింద మొదటి విడత సాయంగా నేడు అందిస్తున్న రూ. 3,882.23 కోట్లతో పాటు మే నెలలోనే వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద మరో రూ. 2,000 కోట్లలను ప్రభుత్వం అందిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా కింద 2019 – 20 నుంచి ఇప్పటివరకు రైతులకు రూ. 13,101 కోట్ల సాయం, ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి మొత్తం రైతు భరోసా సాయం రూ. 16,983.23 కోట్లకు చేరనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా వై ఎస్ ఆర్ రైతు భరోసా కింద ఏటా రూ. 12,500 చొప్పున నాలుగేళ్లపాటు రూ. 50, 000 ఇస్తామన్న ప్రభుత్వం ఏటా రూ. 13, 500 చొప్పున ఐదేళ్లపాటు రూ. 67, 500 అందిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల కింద రైతులకు ఇప్పటివరకు రూ. 67, 953.76 కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Leave Your Comments

సేంద్రియ ఎరువుల వినియోగంపెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Previous article

సాగు భూముల్లో..అధికంగా భాస్వరం

Next article

You may also like