ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టిఎఎఫ్ఇ) చైర్మన్,
మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మల్లికా శ్రీనివాసన్ “(Mallika Srinivasan)
ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏడవ వ్యవస్థాపక దినోత్సవం ఆన్లైన్ విధానంలో జరిగింది. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు,(V.Praveen Rao) రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్లు నివాళులు అర్పించారు. తరువాత వర్శిటీ రిజిస్టార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ స్వాగతోపన్యాసం చేసారు. ఈ ఏడేళ్ల కాలం లో రాష్ట్ర వ్యవసాయ అవసరాలకి తగ్గట్లుగా వర్సిటీ పనిచేస్తోంది అని సుధీర్ కుమార్ అన్నారు. కొత్తగా 3 వ్యవసాయ కళాశాలలు, 1 ఫుడ్ టెక్నాలజీ కాలేజీ, 4 పాలటెక్కునిక్కులు, 2 కృషి విజ్ఞాన కేంద్రాలని ప్రారంభించామన్నారు. 47 కొత్త వంగడాల్ని రూపొందించామని సుధీర్ కుమార్ తెలిపారు. వర్సిటీ పని తీరు గుర్తింపుగా జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టిఎఎఫ్ఇ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మల్లికా శ్రీనివాసన్ (Mallika Srinivasan) “ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ -రోల్ ఆఫ్ యూత్ ” అన్న అంశం పై కీలకోపన్యాసం చేసారు. వ్యవస్థాపక దినోత్సవం అనేది వ్యవస్థ ఏర్పాటు అయిన లక్ష్యాలు, వాటిని సాధించడానికి చేస్తున్న కృషిని పరీలించుకోవడానికి దోహదపడుతుందని మల్లికా శ్రీనివాసన్ అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనలోను ,అత్యంత నాణ్యమైన మానవవనరుల్ని వ్యవసాయ రంగానికి అందించడం లోనూ ఉపకులపతి ప్రవీణ్ రావు నేతృత్వం లో వర్సిటీ అద్భుతంగా పని చేస్తుంది అని అభినందించారు.
మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిది ఎంత కీలక పాత్రో కోవిడ్ సమయం లో మరోసారి రుజువైందని అన్నారు. నాటికి 345 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని మల్లిక అభిప్రాయ పడ్డారు. అనేక వ్యవసాయ ఉత్పత్తుల విషయం లో దేశం మంచి స్తానంలో ఉన్నపటికీ వాల్యూయాడెడ్ ప్రొడక్ట్స్ విషయంలో ద్రుష్టి సారించాలన్నారు. రానున్న డిమాండ్లను సారించాలన్నారు. రానున్న డిమాండ్లను ఎదుర్కోవడానికి సైన్స్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ లు వ్యవసాయ రంగం లో మరింత ప్రధాన పాత్ర పోషించనున్నాయన్నారు. వ్యవసాయ రంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు బాగుందని ఆమె అన్నారు. పరిశోధన, విస్తరణలలో వర్శిటీ చాలా బాగా పనిచేస్తుంది అని అటువంటి వర్శిటీ లో చదవడం విద్యార్థులు చేసుకున్న అదృష్టమన్నారు . ఐసిఏఆర్ వంటి సంస్థల సాయంతో పిజెటిఎస్ఏయు అద్భుతమైన పరికరాలకి ఆవిష్కరిస్తోందని అది చాలా అభినందనీయమన్నారు .ఈ మధ్యనే వర్సిటీ అగ్రి ఇన్నోవేషన్ హబ్ ని ప్రారంభించి ప్రపంచ వ్యవసాయ వర్సిటీల సరసన నిలిచిందని మల్లికా శ్రీనివాసన్ అభినందించారు.అటు రైతులు, ఇటు పరిశ్రమల అవసరాలకి తగ్గట్టుగా వర్సిటీ ముందుకెలుతుందని వివరించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక అనేక మార్పులని తీసుకొస్తుంది . అని సన్న, చిన్న కారు రైతులు ఎక్కువున్న మన దేశానికి అనుగుణంగా వాటిని ఎలా అమలు చేయాలన్నది చూడాలని అన్నారు