వార్తలు

మిద్దెతోటలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

0

ప్రస్తుతం కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవైపోవడంతో భయంతో అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. రోజువారీగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొనేందుకు మార్కెట్లు, రైతుబజార్లకు వెళ్తున్నారు. ఎప్పుడు ఎలా కరోనాకి గురవుతామనే భయం వెంటాడుతూనే ఉంది. సొంత ఇల్లున్న వారు డాబాపై కుండీల్లో కూరగాయలు, పండ్ల చెట్లు, ఆకుకూరలు పెంచుతూ ఇంటి అవసరాలు తీరుస్తున్నారు. నగర జీవనంలో వైవిధ్యంగా ఆలోచిస్తూ రాణిస్తున్నారు మహిళలు. కరీంనగర్ లోని శ్రీపురం కాలనీలో నివాసం ఉండే పీచర కళ్యాణి ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. ఆమె తన నివాసాన్ని నందనవనంలా తీర్చిదిద్దారు. ఆవరణతో పాటు మేడపై పలు రకాల పండ్లు, పూలు, కూరగాయలు, ఆకు కూరలను సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నారు. సంరక్షణకు రోజుకు 2 గంటలు సమయం కేటాయిస్తారు. డ్రాగన్ ఫ్రూట్, లెమన్ గ్రాస్, సపోటా, ఆలు, స్టార్ ఫ్రూట్, అంజీరా, వాటర్ ఆపిల్, చెర్రీస్, స్ట్రాబెర్రీ, మామిడి, దాల్చిన చెక్క, పది రకాల చామంతి, మందార, కలకత్తా తమలపాకులతో పాటు ఇంటికి సరిపడా వివిధ రకాల కూరగాయలను కూడా పండిస్తున్నారు. మొక్కల పెంపకానికి కుండీలతో పాటు టైర్లు, పైపులను అందంగా తయారు చేసి ఉపయోగిస్తున్నారు. సిరిబొమ్మరిల్లు పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ మొక్కల పెంపకం, వాటివల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు.
మార్కండేయకాలనీలో ఉండే గట్టికొప్పుల శోభ, సంపత్ లు తమ ఇంటిపై మిద్దె తోటల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. డ్రిప్ పద్ధతిలో నీటిని వినియోగిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, తైవాన్ జామ, బత్తాయి, సపోటా, స్వీట్ లెమన్, పూనాసమామిడి, తమిళనాడు అరటిపండ్లు, రామాఫలం, గ్రీన్, నల్ల ద్రాక్ష, ఖర్జూర, లక్ష్మణ ఫలం, చెర్రీస్ తోపాటు ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నారు. వేస్ట్ డీకంపోజర్, బెల్లంతో తయారు చేసిన ద్రావణాలు, అల్లం, వెల్లుల్లి, వేపాకు, కిచెన్ కంపోస్టును ఉపయోగిస్తూ మొక్కలను సేంద్రియ విధానంలో పెంచుతున్నారు. దంపతులు రోజు రెండు గంటల పాటు సమయాన్ని కేటాయిస్తున్నారు.

Leave Your Comments

అపరాల నిల్వ కొరకు గాలి చొరవని మూడు పొరల సంచులు (హెర్మాటిక్ బ్యాగులు) వినియోగం

Previous article

మల్చింగ్ విధానం.. పంట దిగుబడి అధికం

Next article

You may also like