తెలంగాణ

తెలంగాణాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ షర్మిల

0
ys sharmila fires on cm

ys sharmilla

ys sharmila fires on cm kcr over farmers sucides ఇటీవల కాలంలో తెలంగాణాలో రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటీవల రవి కుమార్ అనే రైతు ఉరితాడుకు వేలాడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వరి సేకరించబోమని ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ రైతు సీఎం కేసీఆర్ కు లేఖ రాసి తనువు చాలించాడు. ఇక అప్పుల బాధతో మిర్చి రైతు, పంట దెబ్బతిన్నదని పత్తి రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలను కోరుకునే సీఎంగా కెసిఆర్ ని పరిగణిస్తూ షర్మిల ఫైర్ అయ్యారు.

 

Telangana Farmers Suicides యాసంగిలో వరికి బదులు పత్తి, మిర్చి పంట వేసిన రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారని ఆమె అన్నారు. ఒకరు అప్పులు తీర్చలేక, మరొకరు పంట దెబ్బతిన్నదని మరణించారని ఆమె గుర్తు చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ కార్యాలంయంలో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని సుబ్బకపల్లికి చెందిన మిర్చి రైతు రవీందర్‌రావు (Ravinder) (52) అప్పుల బాధతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముద్దాపురంకి చెందిన పత్తి రైతు బడక నరసింహ (Narasimha) (43) కూడా పంట దెబ్బతినడంతోనే నష్టపోయి ఉరేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సీఎం గారూ మీకు ఆకలి తీరుతుందా అని సూటిగా ప్రశ్నించారు. ys sharmila fires on cm kcr

farmers suicide

తెలంగాణ సీఎం కెసిఆర్ రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. కేవలం 70 రోజుల్లోనే 206 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలా వందలాది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని, ఆ పాపం ఊరికే పోదని సీఎంని ఉద్దేశిస్తూ మండిపడ్డారామె. రైతుల జోలికొచ్చిన ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని, రైతును కాటికి పంపుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది, అధికారానికి పాతరేసేది రైతులే అని షర్మిల హెచ్చరించారు. రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి ఈ నెల 19వ తేదీ నుంచి రైతు ఆవేదన యాత్రను చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. YS Sharmila vs CM KCR

sharmila vs kcr

Leave Your Comments

నల్ల తామర పురుగు కలకలం..

Previous article

సేంద్రియ సేద్యంపై మోడీ సూచనలు..

Next article

You may also like