Edula Reservoir: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్దమయింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇటీవల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ ఏదుల పంపింగ్ స్టేషన్ ను సందర్శించి జులై ఆఖరు నాటికి నీరందించేలా ఏదుల పంపులు సిద్దం చేయాలని ఆదేశించారు.
దీంట్లో బాగంగా శుక్రవారం ఏదుల పంపింగ్ స్టేషన్ దగ్గర నిర్మించిన 400 kv సబ్ స్టేషన్ ను ఛార్జి చేయటం జరిగింది. దీంతో పాటు డిండి 400 kv సబ్ స్టేషన్ నుంచి ఏదుల పంపింగ్ స్టేషన్ వరకు నిర్మించిన 60 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్ ను కూడ చార్జి చేయటం జరిగింది.
Also Read: Stray Cattle Menace: ఉత్తర ప్రదేశ్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్న విచ్చలవిడి పశువులు
దీంతో ఏదుల పంపింగ్ స్టేషన్ పంపులను నడపటానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో త్వరలో ఏదుల పంప్ హౌస్ లో పంప్ ల డ్రై రన్ నిర్వహిస్తామని నీటి పారుదల శాఖ సి.ఇ హమీద్ ఖాన్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫోన్‌లో ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీఈ శ్రీరాం నాయక్, సీఈ లతా వినోద్, ఎస్ఈలు విజయ బాస్కర్ రెడ్డి, మానిక్య రావు, ఈఈలు
రాము, రవీందర్, , మహేందర్ రెడ్డి, హరి ప్రసాద్, డీఈలు సత్యనారాయణ గౌడ్, దశరథ్, విజయలక్ష్మి లు పాల్గొన్నారు.
Also Read: G20 Agriculture Ministers Meeting Today: హైదరాబాద్లో నేటి నుంచి G20 వ్యవసాయ మంత్రుల సమావేశం