తెలంగాణ

Wanaparthy Municipal Chairman Gattu Yadav: నీళ్లు తెచ్చిన నిరంజన్ రెడ్డిని వనపర్తి ఎన్నటికీ మరిచిపోదు – మున్సిపాలిటీ చైర్మన్

1
TS Agriculture Minister Niranjan reddy Garu
TS Agriculture Minister Niranjan reddy Garu

Wanaparthy Municipal Chairman Gattu Yadav: కిష్టగిరి సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం, దత్తాయిపల్లి, దావాజిపల్లి గ్రామాలకు సాగు నీరు అందించేందుకు ఖాన్ చెరువు వరకు కొత్తకాలువ నిర్మాణానికి రూ.18.66 కోట్లతో అనుమతించడంపై వనపర్తి నియోజకవర్గ రైతుల కృతజ్ఞత, అభినందన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మిన లక్ష్యం కోసమే నా పోరాటం అని ప్రజల జీవితాలలో మార్పుకోసమే కృషిచేస్తున్నాం.. ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాం అని అన్నారు. గతంలో మోరీ కాల్వలు, కమ్యానిటీ హాళ్లు కట్టి అదే గొప్ప అని చెప్పుకునేది. నియోజకవర్గంలో రూ.25 కోట్లతో చెక్ డ్యాంలను నిర్మాణం చేయడం జరిగింది. అందుకే పట్టుబట్టి సాగునీళ్లను తెచ్చి ప్రతి ఊరిని సస్యశ్యామలం చేశాం.

Farmers' Gratitude and Appreciation Assembly

Farmers’ Gratitude and Appreciation Assembly

రాష్ట్రంలో భూగర్భజలాలు అత్యధికంగా పెరిగిన జిల్లా వనపర్తి అని తెలిసినప్పుడు ఇన్నేళ్ల కష్టం ఫలించింది అనిపిస్తది. దశాబ్దాలుగా అదృశ్యమైన పిట్టలు, పక్షులు, జీవరాశి నేడు కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రాకతో తిరిగి కనిపిస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్ష లేదు .. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నదే మా ఆలోచన అని మంత్రి నిర్జన రెడ్డి అన్నారు.

వనపర్తి నియోజకవర్గంలో 216 ఆవాసాలు ఉన్నాయి .. దాదాపు అన్ని గ్రామాలకు సాగునీరు తెచ్చాను. దత్తాయపల్లి వద్ద కాల్వను గత ఎన్నికల ముందు కొందరు అడ్డుకున్నారు. దత్తాయపల్లి నుండి ఖాన్ చెరువు వరకు కాల్వను తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్, ఆర్థికశాఖలను కష్టపడి ఒప్పించాను. ఖాన్ చెరువు కాల్వను తవ్వే విషయంలో రైతులందరూ సహకరించాలా. వచ్చే యాసంగికి సవాయిగూడెం, కిష్టగిరి, పెద్దగూడెం, దత్తాయిపల్లి, దావాజిపల్లి గ్రామాలలోని 5 వేల ఎకరాలకు అందనున్న సాగు నీరు అందించాలన్నదే ఆకాంక్ష అని మంత్రి తెలిపారు.

Also Read: TS Agri Minister Niranjan Reddy: ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శం -మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

TS Agri Minister Niranjan Reddy Speech

TS Agri Minister Niranjan Reddy Speech

ఇవి పూర్తయితే ఒక్క అంజనగిరి గ్రామమే సాగునీరందని గ్రామంగా ఉంటుంది .. ఎత్తిపోతల ఏర్పాటు చేసి వచ్చే వానాకాలం నీరందించాలని ప్రయత్నిస్తున్నా. అంజనగిరికి నీళ్లందితే వనపర్తి నియోజకవర్గంలోని 216 ఆవాసాలకు నీళ్లందించినట్లు అవుతుంది. ఎత్తు ప్రాంతంలోకి నీరందించేందుకు నియోజకవర్గంలో 60 మినీ ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేశాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఆరు చెక్ డ్యాంలను తీసుకువచ్చి కేవలం 45 రోజులలో నిర్మించాం .. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 10 చెక్ డ్యాంలు మంజూరు చేశారు. పనిచేసిన వారిని ప్రజలు గుండెల్లో దాచుకుంటారు .. సమయం వచ్చినప్పుడు వారి అభిమానం చూయిస్తారు.బతికి ఉన్నప్పుడే కాదు మనిషి చనిపోయాక కూడా జీవించాలి అని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. వనపర్తి తిరుమలయ్య గుట్ట అభివృద్ధికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాం. భవిష్యత్ లో నీటి కొరత అనేది లేకుండా చూస్తాం అని చెప్పారు.

ఈ సందర్భంలో జడ్పీచైర్మన్ లోక్ నాథ్ రెడ్డి వ్యాఖ్యలు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, కరంటు, రైతు పెట్టుబడి సాయం ప్రభుత్వం కల్పించింది. రైతాంగం భవిష్యత్ బాగుంటుంది. వరి తప్ప మిగిలిన పంటలకు మార్కెట్ లో డిమాండ్ ఉంది. రైతులు ఆ దిశగా దృష్టి సారించాలి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యవసాయానికి భారం అవుతున్నది. అందుకే రైతులు డిమాండ్ ఉన్న పంటలనే సాగుచేసి పంటలకు మంచి ధరలు పొందాలి.

Wanaparthy Municipal Chairman Gattu Yadav

Wanaparthy Municipal Chairman Gattu Yadav

జిల్లా పార్టీ అధ్యక్షుడు, మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్ కూడా ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలిపారు. ఇది రైతుల ఆనంద సభ. నీళ్లొచ్చినందుకు ఇంగో 30 ఏండ్లు బతుకుతా అని ఒక రైతు అన్నాడు. గతంలో రాజకీయ కుట్రలతో ఎన్నో అవమానాలు చేశారు. సిద్దిపేట నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరితే , ఆయనకు తోడుగా పాలమూరు నుండి నిరంజన్ రెడ్డి బయలుదేరారు. ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నిలిచారు. నీళ్లు తెచ్చిన నిరంజన్ రెడ్డిని వనపర్తి ఎన్నటికీ మరిచిపోదు. సాగునీటి రాకతో రైతుల కళ్లలో ఆనందం కనబడుతుంది అని గట్టు యాదవ్ అన్నారు.

Also Read: TS Agri Minister Niranjan Reddy: కొల్లిపరలోని అరటిసాగును పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ మంత్రి.!

Leave Your Comments

National and International Agricultural Institutes: జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు.!

Previous article

Agri Awards 2022: అగ్రి ఇన్ ఫుట్స్ పరిశ్రమలకు తెలంగాణ కేంద్ర బిందువు – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like