తెలంగాణ

Minister Niranjan Reddy: సాగునీటి రాకతో అత్యధికంగా భూగర్భజలాల పెరిగిన జిల్లాగా నిలిచిన వనపర్తి – మంత్రి

1
Telangana Minister Niranjan Reddy
Telangana Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా ఫైలుపై తొలిసంతకం, నియోజకవర్గంలో నూతన చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనల ఫైలుపై మలిసంతకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చేసారు. ఆ సంధర్భంగా ఛాంబర్ లో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా ఫైలుపై మంత్రి నిరంజన్ రెడ్డి గారు తొలిసంతకం చేశారు. రూ.76.66 కోట్ల సబ్సిడీ వెచ్చించనున్న ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు. సేంద్రీయ సాగు, నేల ఆరోగ్యం కాపాడేందుకు గాను ప్రతి ఏటా మాదిరిగానే వానాకాలంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేసారు.

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

నియోజకవర్గంలో చెక్ డ్యాంల కోసం మలి సంతకాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నిర్మాణం పూర్తై అందుబాటులోకి 10 చెక్ డ్యాంలను తీసుకురావడం జరిగిందని, 2 చెక్ డ్యాంలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. మరో 18 చెక్ డ్యాంలు, ఒక చెక్ డ్యాం మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన అందించామని మంత్రి చెప్పారు.

Also Read: Eruvaaka Foundation Annual Awards 2022 Andhra Pradesh – Winners: ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్ విజేతల జాబితా

చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు, కాలువల ద్వారా ఇప్పటికే లక్ష పై చిలుకు ఎకరాలకు సాగునీరు అందించడం జరిగిందని మంత్రి చెప్పారు. ఖిల్లా ఘణపురం మండలంలో 5, వనపర్తి మండలంలో 3 కొత్తవి, ఒకటి మరమ్మతు, పెద్దమందడి మండలంలో 8, రేవల్లి మండలంలో 2 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.38.75 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్దం చేసారని చెప్పారు.

ఏటా రెండు, మూడు పంటలతో సాగులో రైతాంగం నిమగ్నమయ్యారని రైతులు, రైతు కూలీలకు నిరంతరం చేతినిండా పని ఉందని ఉపాధి కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వస్తున్నారని మంత్రి అన్నారు.

Wanaparthy became the district with the highest increase in groundwater level due to the arrival of irrigation water

Wanaparthy became the district with the highest increase in groundwater level due to the arrival of irrigation water

గత తొమ్మిదేళ్లలో వనపర్తి ప్రాంతానికి సాగునీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఘణపురం, బుద్దారం కుడి, ఎడమ బ్రాంచ్ కెనాళ్లు, డీ8పై ఎంజె 3, ఎంజె 4 కాలువలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏడాది 11 నెలల స్వల్పకాలంలో 6.55 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్ నిర్మాణం, కాలువలు సప్తసముద్రాలతో అనుసంధానం, గణపసముద్రం రిజర్వాయర్ గా మార్పు చెందింది.

76.19 కోట్లతో కర్నె తండా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎస్ఆర్ నిధులతో 65 మినీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టడం జరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సాధించిన మంత్రి గారది. దీంతో 2.50 లక్షల ఆయకట్టు నుండి 5 లక్షల ఎకరాలలో పంటల సాగు సాధ్యమయింది. సాగునీటి రాకతో అత్యధికంగా భూగర్భజలాల పెరిగిన జిల్లాగా వనపర్తి నిలిచింది.

ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావు,జడ్పీ చైర్మన్లు తదితరులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: PJTSAU: పీజేటీఎస్ఏయూ లో ఘనంగా జరిగిన బ్రీడర్ విత్తనోత్పత్తి మరియు చిరు సంచుల పరీక్షలపై సదస్సు.!

Leave Your Comments

Eruvaaka Foundation Kisan Mahotsav – 2023, Andhra Pradesh – Winners: ఏరువాక ఫౌండేషన్ కిసాన్ మహోత్సవం – 2023, వ్యవసాయ వార్షిక అవార్డులు – 2022, ఆంధ్రప్రదేశ్ విజేతల జాబితా

Previous article

Minister Niranjan Reddy: పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Next article

You may also like