ఉద్యానశోభచీడపీడల యాజమాన్యంతెలంగాణవ్యవసాయ పంటలు

తీగజాతికూరగాయాలపంటలనుఆశించే పండు ఈగ నివారణ

0

తీగజాతికూరగాయపంటలుదేశవ్యాప్తంగావిస్తృతంగాపండించేముఖ్యమైనకూరగాయలసమూహం. ఈకూరగాయలపంటలలోవినాశకరమైనచీడపురుగుపండుఈగ (మెలోన్ ఫ్రూట్ ఫ్లై(Melon Fruit Fly), బాక్ట్రోసెరా కుకుర్బిటే(BactroceraCucurbitae)(కోక్విల్లెట్(Coquillet))ముఖ్యంగాకాకర, సొరకాయ, బీర, స్పాంజి పొట్లకాయ, పుచ్చకాయ, ఖర్బుజా మరియుకీరదోసజాతిపంటలనుఆశించి30-70%వరకుపంటనష్టాన్నికలుగజేస్తున్నాయి. ఈనష్టతీవ్రతసీజన్ మరియువాతావరణపరిస్థితులపైఆధారపడిఉంటుంది

పండుఈగగుర్తింపులక్షణాలు : లఎరుపురంగులోఉండిముఖ క్రిందిభాగంలోనల్లటిమచ్చలుకలిగిఉంటుంది. ఉర,ఉదరంముదురుఎరుపురంగులోఉండిఉరం పార్శ్వపు ఖండితాలుపసుపురంగులోఉండును. ఉదరంఖండితాలుకైటిన్ నిర్మిత మైఉండును. ఒకజతపలుచనిరెక్కలపైచివరనల్లటిమచ్చఇరువైపులాఉండును.

పండుఈగజీవితచక్రం: ఈతల్లిఈగలుచిన్నచిన్నగుంపులుగాకాయఅడుగుభాగంతొక్క  క్రింద2-15 గుడ్లుపెడుతుంది.ఒకనెలలోఒకఈగ200 వరకుగ్రుడ్లను, తనజీవితకాలంలో600-1000 గుడ్లుపెడుతుంది. ఈగ్రుడ్డుదశఅనేదిచలికాలంలో10 రోజులవరకు, వేసవిమార్చిమరియు  ఏప్రిల్3-4రోజులుఉంటుంది. ఈగ్రుడ్లనుoడిలార్వాలు (మ్యాగట్) 7-30 రోజులకిపంటకాలాన్నిబట్టిపొదగబడతాయి. ఈలార్వాలుకాయల  నుండివెలువడిననేలలోకివెళ్లిఆవాసాన్నిఏర్పరుచుకొనికోశస్థదశ (ప్యూపా)ని4-15 రోజులలోపూర్తిచేస్తాయి. ఈకోశస్థదశనుండి  రెక్కలపురుగుగామారడానికి25-30 రోజుల సమయంపడుతుంది. ఇలాపండుఈగజీవితచక్రంపూర్తికావడానికినెలరోజులసమయంపడుతుంది.

పండుఈగదశలు : ప్యుపాలార్వాపండుఈగ

 గాయపరిచేవిధానం :

ఈతల్లిఆడఈగసూదిలాంటిమొననులేతఆకుపచ్చకాయతొక్కలోనికిచొప్పించిగుడ్లుపెడుతుంది. ఈగుడ్లుపొదగబడినతర్వాత, చిన్నలార్వాలువృద్దిచెందికాయలోనిగుజ్జుతినడంవల్లకాయలుమెత్తబడికుళ్ళిరాలిపోతాయి.  ఈపండుఈగఆశించినపండ్లువాటిపైసూదితోగుచ్చినట్టుగాఉన్నరంధ్రాలనుబట్టిగుర్తుపట్టవచ్చు. ఆపండ్లుకోసిచూసినట్లయితేఅందులోలార్వాలుఉంటాయి.

సమగ్రసస్యరక్షణ చర్యలు: ఈగపండ్లరుచిని, నాణ్యతనుదెబ్బతీయడం, కోతతర్వాతపండ్లలోఉండటం  వల్లబయటదేశాలఎగుమతులకుకూడాఅంతరాయంకలగడంవల్లరైతులుఆశించినస్థాయిలోఆదాయంపొందలేక  పోతున్నారు.పరిమితికిమిoచిక్రీమీసంహారకమందులుపిచికారీవల్లకూరగాయలపైరసాయనఅవశేషాలుపేరుకపోయిఇతరదేశాలఎగుమతులుకూడాతిరస్కరించబడుతున్నాయి. కాబటిరైతులుపురుగుఆశిoచినపుడునేరుగాకీటకనాశినులజోలికిపోకుండాసమగ్రసస్యరక్షణచర్యలుచేపడితేతక్కువఖర్చుతోఅధికదిగుబడులుపొందవచ్చు.

సహజసిద్దపద్ధతులు: ముందుగారాలిపోయినపండ్లనుఏరినాశనంచేయాలి.అలాగేపండుఈగఆశించినపండ్లుగుర్తించిచెట్లనుండితొలగించి  కాల్చివేయాలి. చెట్టుక్రిందిపాదులు10 సెం.మీ. తవ్వడంవలన,  నేలలోపలదాగిఉన్నకోశస్థదశలోఉన్నపురుగులనునివారించవచ్చు.

ఫెరోమోన్ఎరలు/ఆకర్షణఎరలు/లింగాకర్షకబుట్టలుఉపయోగించడం 

ఆకర్ష్ మీ జెల్ లూర్:ఆకర్ష్ మీ జెల్ లూర్ అనేపేస్ట్ నెమ్మదిగామరియునిరంతరంగాఫెరోమోన్లువిడుదలచేసేపేటెంట్ పొందినసరికొత్తసాంకేతికపరిజ్ఞానంతోరూపొందించబడినఉత్పాదన. ఈపేస్ట్ బీర, సొర, దొండ, కాకర, దోస, పుచ్చవంటితీగజాతికూరగాయలనుఆశించేపండుఈగలనుసమర్ధవంతంగాఅరికట్టకలదు. ఇదిఒకప్రకృతిసిద్ధఉత్పాదనకావునసేంద్రియవ్యవసాయంలోచాలాబాగాఉపయోగపడుతుంది.

వాడవలసినవిధానం: ఈపేస్ట్ కుఆమోదంపొందినఏదైనారసాయనికపురుగుమందులనుకలిపినచోసమర్ధవంతంగాఎక్కువకాలంపండుఈగలనునివారించగలదు. ఈ250 గ్రాముల  పేస్ట్ కుఆమోదంపొందినపురుగుమందులైనటువంటిఫెప్రోనిల్5% SC లేదాస్పినోసాడ్లలోఏదైనాఒకమందును7.5-10 మి.లీబాగాకలిపిచెట్లకాండంమీద ప్రతి  చోట0.5 -1 గ్రాముచొప్పున, ప్రతి4-5 మీటర్లదూరంలోపెట్టుకోవాలి.

వాడవలసినసమయం:పూతకుముందుకానీపూతసమయంలోకానీవాడినట్లైతేమంచిఫలితాలుఉంటాయి. అదేవిధంగాపూతలేనిసమయంలోకూడావాడితేపండుఈగసంఖ్యను వీలైనంతఅదుపులోఉంచవచ్చు. ఈవిధంగాప్రతి30-45 రోజులకుఒకసారిరెండులేదామూడుసార్లువాడాలి.

విషపుఎరతయారీ: పండుఈగఉధృతిఅధికంగాఉన్నప్పుడులీటరునీటికి100గ్రా.బెల్లం +5 మి.ల్లీ. మలాథియాన్ కలిపి(100మిల్లీ. ఎరమందునుపాత్రలోపోసి) ఒకఎకరానికి4 ఎరలుఅక్కడక్కడ  అమర్చడంద్వారాకూడాఉధృతినితగ్గించవచ్చు.

జీవరసాయనాలద్వారానియంత్రణ: ప్రకృతిలోసహజసిద్ధంగాఉండేపరాన్నజీవులు,పరాన్నభుక్కులుగరిష్టవిషప్రభావంగలకీటకనాశినులుపిచికారిచేయడంవల్లపూర్తిగానాశనంమవుతున్నాయి. అలాగేపంటనుఆశించుకీటకాలురోగనిరోధకశక్తినిపెంపొందించుకొనిపంటలునష్టపరచడంవల్లరైతులకుసత్ఫలితాలనుఇవ్వడంలేదు. కావునరైతులుసమగ్రసస్యరక్షణచర్యలుభాగంగాపరాన్నజీవులు, పరాన్నభుక్కులుమరియుసూక్ష్మజీవులఆధారితజీవరసాయనాలువాడినాణ్యమైనదిగుబడులనుపొందవచ్చు. పండుఈగనివారణకికీటకశిలీంధ్రనాశినిఅయినమెటారైజియంఎనైసోప్లిపొడిరూపంలోమార్కెట్లోలభ్యమవుతుంది. ఈపొడిమందును5 గ్రా. లీటరునీటికికలుపుకొనిపిచికారీచేసినచోఈగలార్వా, కోశస్థదశమరియుతల్లిఈగలపైబూజుబాగాఏర్పడిపురుగుని  నిర్వీర్యంచేస్తుంది.

సిఫారసుచేసిన కీటకనాశినులు: 

  • 100 గ్రా.బెల్లం+ డెకా మెత్రిన్2.8% ఇ.సి2మి.ల్లీ.నులీటరునీటికికలిపిపొలంగట్లలోపిచికారిచేయడంవలనగ్రుడ్డుమరియుకోశస్థదశనివారించవచ్చు.
  • పిందెదశదాటిననాటినుండి1500 పి.పి.యం. వేపనూనె5మి.ల్లీ.నులీటరునీటికికలిపిపిచికారీచేసినట్లయితే  పండుఈగగ్రుడ్డుదశసమర్థవంతంగానివారించవచ్చు.
  • డెకా మెత్రిన్2.8% ఇ.సి. 0.5మి.ల్లీ. + వేపనూనె2మి.ల్లీ.నుకోతకు3 వారాలముందుపిచికారీచేయాలి.
  • స్పినోసాడ్45% SC 0.3మి.ల్లీ.నులీటరునీటికికలిపిపిచికారీచేయాలి. పండుఈగఉదృతినిబట్టి15 రోజులవ్యవదిలోఇంకోసారీపిచికారీ చేయాలి.
  • మలాథియాన్50 %ఇ.సి. 1మి.లీ. లేదాలాంబ్డా-సైహాలోత్రిన్ 5% ఇ.సి 2మి.ల్లీ.నులీటరునీటికికలిపిపిచికారీచేయాలి.

సి. అశ్విని, ఉద్యానపాలిటెక్నిక్ కళాశాల, డా. వి.మురళి, ఉద్యానపరిశోధనాస్థానం,ఆదిలాబాద్,శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం.

 

 

Leave Your Comments

కాసులకల్పతరువు–కనకాంబరం

Previous article

హిమానీ నదుల సంరక్షణ తోనే సమస్త జీవకోటి మనుగడ

Next article

You may also like