తెలంగాణవ్యవసాయ పంటలు

గాలి వానకు రాలిన మామిడికాయలకు విలువ జోడింపు

0

ప్రపంచంలోనే భారతదేశం మామిడి పండ్ల ఉత్పత్తి మరియు మామిడి పండు యొక్క గుజ్జు (pulp) ఎగుమతులలో ప్రథమ స్థానంలో ఉంది. మామిడిని సుమారు 80 దేశాలలో పండిస్తున్నారు.మనదేశంలో 2023-24 సంవత్సరంలో సుమారు 23,96,219 హెక్టార్లలో (2.39 మిలియ హెక్టార్లు) మామిడి సాగు చేస్తున్నారు తద్వారా 22,39,8208 మెట్రిక్టన్నుల (22.39 మిలియన్ మెట్రిక్ టన్నుల ) మామిడి పండ్ల ఉత్పత్తి జరుగుతుంది. తెలుగురాష్ట్రాల్లో సుమారు 13,07,175 ఎకరాలలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి తద్వారా 5,92,4510 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు, కాయల ఉత్పత్తి జరుగుతుంది. తెలంగాణ ఉత్పత్తి మరియు సాగు విస్తీర్ణం దేశ ఉత్పత్తి మరి విస్తీర్ణంలో సుమారు 11%  శాతం. భారతదేశం 2023-24 సంవత్సరంలో 32104 మెట్రిక్ టన్నులు తాజా మామిడిని ప్రపంచానికి ఎగుమతి చేసింది, దీని విలువ రూ.60.14 మిలియన్ డాలర్స్.మాడి పండ్లలో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధికంగా దొరుకుతాయి ముఖ్యంగా పొటాషియం మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తాయి.యాంటీఆక్సిడెంట్స్ ,కారోటీనిడ్స్, ఫ్లవానిడ్స్ వంటి సూక్ష్మ రసాయన పదార్థాలు మరియు రోజుకు కావలసిన పీచుపదార్థంలో సుమారు  40 శాతం మామిడి పండు తినడం ద్వారా వరకు దొరుకుతాయి. పచ్చి మామిడి కాయలతో ఆంచూర్ పౌడర్ , మామిడి కాయ పచ్చడి, మామిడి పండు జ్యూస్, మామిడి పండు లెదర్ బార్ ,  మామిడిపండ్ల రిపెనింగ్ చాంబర్,  మామిడి పండ్ల జమ్, జెల్లీ, గుంజెళ్ళీస్, మొదలైన చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు రైతులు ఏర్పాటు చేసుకుంటే అకాల నష్టాలను అధిగమించవచ్చు.

నేల రాలిన మామిడి కాయలతో ఆంచూర్ పౌడర్ తయారీ:-

మామిడి కాయ కోత దశకు వచ్చే సమయంలో లేదా ముందు గానీ అకాలవర్షాలు, వడగండ్ల వానలు,  గాలి దుమారం వలన ఎంతో విలువైన మామిడి కాయలు నేలరాలి పోతున్నాయి. అది మామిడి రైతులకు దుఃఖాన్ని కలగజేస్తుంది.  నష్ట నివారణ చర్యలో భాగంగా నేలరాలిన మామిడి కాయలతో ఆంచూర్ పొడి తయారుచే యడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చు.100 కిలోల రాలిన పచ్చి మామిడి కాయలను తీసుకొచ్చి క్లోరినేటెడ్ (సోడియం హైపో క్లోరైడ్ సొల్యూషన్: 100ppm) వాటర్ లో శుభ్రం చేసి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసి , జీడి తీసి వేసిన తర్వాత సుమారు  75 నుండి 82 కిలోల పచ్చి మామిడి కాయల ముక్కలు మిగులుతాయి.  తరువాత ఒక పెద్ద పాత్రలో లేదా బకెట్లో ముక్కలు వేసి సుమారు 20 -30% ఉప్పును కలపాలి.  ఉప్పు శాతం మామిడి ముక్కల పుల్లదనాన్ని బట్టి మారుతుంది. ఒక 24 గంటలు కలిపి ఉంచిన తర్వాత ఎండలో ఆరబెట్టడం,లేదా సోలార్ డ్రైయర్ ,  లేదా ఎలక్ట్రిక్ ట్రై డ్రైర్ ఎండబెట్టడం మనకు  20 – 30 కిలోల మామిడి కాయ ఒరుగులు లభిస్తాయి.తర్వాత వాటిని పిండి పట్టడం ద్వారా ఆంచూర్ పొడి దొరుకుతుంది.  ఆంచూర్ పొడిని వివిధ రకాల మాంసాహారాలు,శాఖాహారాలు,చాట్ మసాలా,  పానీ పూరి నీళ్లు తయారు చేయడంలో వాడుతారు.రిటైల్ మార్కెట్ ధరల ప్రకారంఒక కిలో ఆంచూర్ పొడి రూపాయలు 500 నుండి 700 వరకు ధర పలుకుతుంది.100 కిలోల రాలిన పచ్చి మామిడి కాయల నుండి రూపాయలు. 10,000- 14,000  స్థూల ఆదాయం లభించవచ్చు.

మామిడి కాయలను కోత కోసేసమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:-

  • సరైన దశలో కాయలను కోయాలి
    కాయలను చల్లటి సమయంలో కోయాలి
    సరైన పనిముట్లుతో మరియు సక్రమైన పద్ధతులతో కాయల్ని కొయ్యాలి
    మేలైన ప్యాక్ హౌస్ పద్ధతులను పాటించాలి: కాయలులో సోనా తీసివేయడం
    నీటితో శుభ్ర పరచడం
    పనికిరాని మరియు దెబ్బతిన్న కాయలను వేరు చేయడం
    కాయ సైజు మరియు రంగులను బట్టి వివిధ గ్రేడ్లుగా విభజించి ప్యాక్ చేసి అమ్మి నట్లయితే లాభం ఎక్కువగా ఉంటుంది
    శిలీంధ్ర నాశిని వంటి రసాయనాలతో కాయలను శుభ్రపరచుకోవాలి
    సరైన పద్ధతిలో అనువైన పెట్టెలలో ప్యాకింగ్ చేయుట
    నిర్ధిష్టమైన వాతావరణంలో అంటే సరైన ఉష్ణోగ్రత వాతావరణంలోని తేమ శాతంలో ఫ్రీకూలింగ్ చేయాలి.
    శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయుట
    కంట్రోల్ వాతవరణంలో ఉంచుట
    కోల్డ్ స్టోరేజ్ వాహనాలలో కాయలను రవాణా చేయడం
    రిపెనింగ్ చాంబర్స్ ద్వారా కాయలను పండించడం
    మార్కెట్ ఇంటలిజెంట్ సమాచారంతో కాయలను మరియు పండ్లను మార్కెట్ కు సిద్ధం చేయడం

మామిడి పచ్చడి తయారీ

మామిడి కాయ పచ్చడి తయారీ కోసం పక్వానికి వచ్చిన పుల్లని కాయలను ఎంచుకొని వాటిని క్లోరినేటెడ్ నీటిలో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తేమ లేకుండా తుడవాలి. తరువాత మామిడి కాయ ముక్కలుగా కట్ చేసి, లోన ఉన్న జీడిని తీసివేయాలి.  కట్ చేసిన ముక్కలను మరో గిన్నెలో తీసుకొని తగిన మోతాదులో ఉప్పు, కారంపొడి,మెంతుల పొడి, ఆవాల పొడి,  పొట్టు తీసినా వెల్లుల్లి పాయాలను కొన్నింటిని మిక్సీలో క్రష్ చేసి ముద్దచేసి,  కొంచెం పళ్లి నూనె వేసి బాగా కలపాలి. మరో బాణీలో నూనె వేడి చేసి తాలింపు గింజలను వేయించాలి. చల్లారిన తాలింపు గింజలు మరియు నూనెను పచ్చడి మిశ్రమానికి కలపాలి. బాగా కలిపిన తరువాత శుభ్రమైన గాజు సీసాలో గాని,  ప్లాస్టిక్ కంటైనెర్స్ లో గాని,  స్టాండప్ పెట్ – పాళీ ఇథైలిన్ పౌచెస్ లో ప్యాక్ చేయడం ద్వారా సుమారు 6 – 9  నెలల వరకు నిల్వ పచ్చడిగా తినవచ్చును.

కృత్రిమంగా సురక్షిత పద్ధతిలో మామిడి కాయలను మాగ పెట్టడం సహజ సిద్ధంగా పండిన మామిడి పండ్లను ఎక్కువ దూరం రవాణా చేయలేము అంతేకాకుండా అవి త్వరగా పాడు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.  ఇదిపంటనష్టానికిదారితీస్తుంది.పంటనష్టాలుతగ్గించడం,  అధికలాభాలనుగడించడం,  మార్కెట్లోఅందరికీమామిడిపండ్లనుఅందుబాటులోఉంచడంకోసంమామిడికాయలనుకృత్రిమంగాసురక్షితపద్ధతిలోహానికరరసాయనాలనువాడకుండామరియువాటిరసాయనఅవశేషాలుపండ్లలోకివెళ్లకుండామామిడికాయలనుపండ్లలుగామార్చడంఎంతోఅవసరం.

1.కృత్రిమంగామామిడికాయలనుపండ్లుగాపండించడానికినిషేధితరసాయనాలుముఖ్యంగాకాల్షియంకార్బైడ్,  ఎసిటిలీన్గ్యాస్ద్వారాపండించడంకేంద్రఆహారభద్రతప్రమాణాలసంస్థనిబంధనలప్రకారం (FSSAI-2011) చట్టరీత్యానేరం.

2.కాల్షియంకార్బైడ్,  ఎస్టెలిన్గ్యాస్ద్వారామామిడికాయలనుపండ్లుగాపండించడం,తినడంవలనపండ్లపైనహానికరమైనరసాయనఅవశేషాలుముఖ్యంగాఆర్సెనిక్మరియుభాస్వరంమొదలైనఉండటంవలనమైకము, తరచుగాదాహం, చికాకు, బలహీనత, మింగడంలోఇబ్బంది, వాంతులు, చర్మపుపుండుమొదలైనఅనారోగ్యసమస్యలుకలుగుతాయి.

3.కాల్షియంకార్బైడ్నుండిఎస్టెలిన్గ్యాస్ఉత్పత్తిసమయంలోఅక్కడపనిచేస్తున్నవారికికూడాఅనారోగ్యసమస్యలనుకలిగిస్తాయి.

4.పండ్లనుసహజంగాపండించడంలోఇథిలీన్కీలకపాత్రపోషిస్తుంది. ఇదిసహజంగాపండ్లనుండిఉత్పత్తిఅయ్యేహార్మోన్.ఇథలీన్గ్యాస్పండనిమిగతామామిడికాయలనుపండడానికిముఖ్యంగాఇథిలీన్ఉత్పత్తినిప్రేరేపిస్తుంది.

5.అనుమతించబడినపద్ధతులప్రకారంపండ్లపక్వతఖచ్చితంగానియంత్రించబడుతుందనిఆమోదించబడినఇథిలీన్గ్యాస్వనరులను (ఈథెఫోన్, ఈథెరియల్మరియుఇతరఅనుమతించినవనరులు) ఉపయోగించడంద్వారామాత్రమేకృత్రిమంగామామిడికాయలనుపండ్లుగాపండించడంకోసంపంట, రకాన్నిబట్టి 100 ppm (100μl/L) లగాఢతప్రమాణాలనువాడాలనికేంద్రఆహారభద్రతప్రమాణాలసంస్థనిబంధనలు (FSSAI-2011) సూచిస్తున్నాయి.

6.పండ్లనుపండించేగదిలేదాతాత్కాలికనిర్మాణంలోపల 20-25 కిలోలసామర్థ్యంగలక్రేట్స్, వెంటిలేటెడ్ప్లాస్టిక్డబ్బాలులేదాస్టాక్చేయగలపండ్లపెట్టెల్లోఉంచాలి. బాక్సులనుపేర్చడంగోడలనుండిమరియుప్రక్కనేఉన్నడబ్బాలమధ్యకనీసం 4-6 అంగుళాలఖాళీనిఉంచాలి.ఏకరీతిపక్వానికి, గదిఅంతటాఇథిలీన్గ్యాస్చేరేవిధంగాఏర్పాటుచేసుకోవాలి.

7.కృత్రిమంగాపండ్లనుఇథిలీన్గ్యాస్తోపక్వంచేసేసమయంలోపండ్లనుపండించేగదిలేదాతాత్కాలికనిర్మాణం (అలాగేక్రేట్) సామర్థ్యంలో 75% కంటేఎక్కువఆక్రమించకూడదు.

8.పక్వానికివచ్చినమామిడికాయలకుఇథలీన్గ్యాస్తగిలినవెంటనేచర్యకారణంగాకాయలుపండ్లుగామారటంమొదలవుతాయి. అదేసమయంలోపక్వానికివచ్చినమామిడికాయనుండికూడాఇథలీన్గ్యాస్విడుదలఅవుతుంది.  అధికమోతాదులోఇథలీన్గ్యాస్గాఢతపెరిగిపండ్లుతొందరగాపాడైఅవకాశంఉంటుంది. కావునఇథలీన్గ్యాస్నేరుగాపండ్లుకుతాకకుండాఏర్పాట్లుచేసుకోవాలి.

9.పండ్లతోప్రత్యక్షసంబంధంలోవచ్చేఇథిలీన్వాయువుయొక్కఏదైనామూలంఅనుమతించబడదు.

10.ఇథిలీన్వాయువుయొక్కమూలాలు: – ఈక్రిందివ్యవస్థలద్వారాపొందినఇథిలీన్వాయువునుపండ్లకృత్రిమపక్వానికిఉపయోగించవచ్చు:

ఎ) రైపెనింగ్  చాంబర్స్ కోసం
i) ఇథిలీన్ గ్యాస్  సిలండర్లు
ii) సంపీడన ఇథిలీన్ వాయువు (ఏరోసోల్  డబ్బాలు)
iii) ఇథిలీన్  జనరేటర్లు
iv) ఆల్కలీతో 2 క్లోరోఇథైల్ఫాస్ఫోనిక్ ఆమ్లం (ఈథెఫోన్/ఎథ్రెల్)
బి) డబ్బాలు / పెట్టెల కోసం
i) పొడి రూపంలో 2 క్లోరోఇథైల్ఫాస్ఫోనిక్ ఆమ్లం (ఈథెఫోన్).
ii) సెల్యులోజ్, స్టార్చ్ మరియు ప్రొటీన్లు వంటి జీవశాస్త్రపరంగా సురక్షితమైన పదార్ధాలలో ఇథిలీన్ వాయువు కప్పబడి (ఎన్కాప్సిలేటె) చేయబడిన గుళికల వంటి పదార్థం.
11.హానికరమైన లేదా నిషేధిత రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను పండ్లుగా పండించలేదని తెలిపే బోర్డులను పెట్టి అమ్మే విక్రేతలు/ప్రఖ్యాత దుకాణాలు / డీలర్ల నుండి వినియోగదారులు పండ్లను కొనుగోలు చేయాలి.
12.మార్కెట్లో అక్రమంగా ఎవరైనా కాల్షియం కార్బైడ్ద్ ద్వారా మామిడి పండ్లను పండిస్తే మీ దగ్గర లోని  ఫుడ్  సేఫ్టీ  ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినట్లయితే చట్టరీత్యా తగు చర్యలు చేపడతారు.

ఎ. పోశాద్రి , యం. సునీల్ కుమార్ , జి. శివచరణ్, డి.మోహన్ దాస్ , కె.రాజశేఖర్, వై.ప్రవీణ్ కుమార్ , కృషివిజ్ఞానకేంద్రం,ఆదిలాబాద్, ఫోన్ : 94928 28965

 

Leave Your Comments

వేసవిలో  పంటలు మరియు పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Previous article

You may also like