Turmeric Price: పసుపు పండించే రైతులు గత రెండు, మూడు సంవత్సరాల నుంచి ధర లేక చాలా మంది రైతులు పసుపు పంట పండించడంలేదు. 30 సంవత్సరాల నుంచి పసుపు సాగు చేసిన రైతులు కూడా ధర తక్కువగా రావడంతో వ్యాణిజ్య పంటలు పండిస్తున్నారు. కనీసం ఈ వాణిజ్య పంటలో అయిన లాభాలు వస్తాయి అని వీటిని సాగు చేస్తున్నారు. 2020 సంవత్సరంలో పసుపు 11500 రూపాయల వరకు ధర వచ్చింది. 2021,2022 సంవత్సరంలో 5-6 వేలు మాత్రమే ఉంది.
ధర తక్కువ రావడంతో రైతులు పండించిన పసుపు పంటని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ధర ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకోవాలి అని చూస్తున్నారు. గత రెండు రోజులుగా పసుపు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పుడు ధర ఎక్కువ రావడంతో రైతుల పంటను అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం పసుపు ధర 10 వేలు పైనే పెరిగింది. తెలుగు ప్రాంతాల్లో పసుపు ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలో పండిస్తారు. ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు 10-11 వేల రూపాయల ధరతో రికార్డు సృష్టిస్తోంది.

Turmeric Price
కోల్డ్ స్టోరేజీలో పంట నిల్వ చేసుకున్న రైతులు ఇప్పుడు అమ్ముకొని మంచి లాభాలు తీసుకుంటున్నారు. ముందుగా పంటని అమ్ముకున్న రైతులు నిరాశ పడుతున్నారు. ధర పెరగడంతో పంటకి పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు వస్తున్నాయి అని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు.
ఈ సంవత్సరంలో పసుపు పంట పండించడం తగ్గించడం, ఉత్తర భారత్ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలతో పసుపు పంట పండించక పోవడం. ప్రస్తుతం ధరలు పెరగడానికి కారణం. నిజామాబాద్ ప్రాంతాల్లో కేవలం ఈ సంవత్సరం 32 వేల ఎకరాలలో పసుపు సాగు చేశారు. గత సంవత్సరం 50 వేల ఎకరాలలో సాగు చేశారు. పంట సాగు తగ్గడంతో ధరలు పెరగనున్నాయి.
Also Read: CM YS Jagan: వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష…