TS Polycet 2022 – 23 Counselling: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సిలింగ్ ను రిజిస్ట్రార్ర్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ ప్రారంభించారు.
అగ్రి పాలిసెట్ లో 198 వన్ ర్యాంకు పొందిన ఎన్. శ్రీకాంత్ జగిత్యాల లోని వ్యవసాయ పాలిటెక్నిక్ లో అగ్రికల్చర్ డిప్లొమాలో తొలి ప్రవేశం పొందారు. అలాగే 1024 ర్యాంకు పొందిన అనూషకు కూడా, జగిత్యాల వ్యవసాయ పాలిటెక్నిక్ లో రెండేళ్ళ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశంపొందగా, 1453 ర్యాంకు పొందిన శ్యామ్ మధిర లోని వ్యవసాయ పాలిటెక్నిక్ లో ప్రవేశంపొందారు.
Also Read: PJTSAU: పిజెటిఎస్ ఎయూలో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ కార్యక్రమం.!
అభ్యర్థులకు ప్రవేశ పత్రాలు అందజేసి రిజిస్ట్రార్ కౌన్సిలింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ డిప్లమా పూర్తిచేసిన విద్యార్థులకు ఉండే ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, వివిధ కళాశాలలో ఉన్న సౌకర్యాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో పాలిటెక్సిక్స్ డైరెక్టర్ డాక్టర్ పద్మజా, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. సోమవారం ప్రారంభమైన ఈ మొదటి విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 4వ తేదీ వరకు కొనసాగనుంది.
Also Read: PJTSAU Vice-Chancellor Retirement: పిజె టిఎస్ ఎయూ ఉపకులపతి పదవీ విరమణ.!
Also Read: Agri Awards 2022: అగ్రి ఇన్ ఫుట్స్ పరిశ్రమలకు తెలంగాణ కేంద్ర బిందువు – మంత్రి నిరంజన్ రెడ్డి
Also Read: National and International Agricultural Institutes: జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు.!