Counseling for Agriculture and Veterinary courses:వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల తొలి విడత సంయుక్త కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ సంయుక్త కౌన్సిలింగ్ ను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు.ప్రైవేటు రంగాలలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ, వెటర్నరీ ఉద్యాన విశ్వవిద్యాలయాల అధికారులు వివరించారు.

Veterinary and Horticulture Course
విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న ఈ కౌన్సిలింగ్ లో వెటర్నరీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వీరోజీ రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ సీమ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్, ఉద్యాన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని విద్యార్థులకు ప్రవేశపత్రాలు అందజేశారు.
Also Read: Acharya N.G. Ranga Agricultural University: డ్రోన్ల వినియోగంలో శిక్షణకు పరస్పర సహాయ సహాకారాలు.!
తెలంగాణ ఎంసెట్- 2022లో 209వ ర్యాంకు పొందిన వర్ష, 333వ ర్యాంకు పొందిన సుజన రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో బి.వి.ఎస్సి అండ్ ఏ. హెచ్ కోర్సులలో ప్రవేశం పొందారు. అలాగే 348 ర్యాంకు పొందిన హరిణి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశం పొందింది. వ్యవసాయ, అనుబంధ కోర్సులు చదివిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ, వెటర్నరీ ఉద్యాన విశ్వవిద్యాలయాల అధికారులు వివరించారు. మూడు విశ్వవిద్యాలయాల పరిధిలోని అన్ని కళాశాలలో ఉత్తమమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.

Awards Ceremony
Also Read: 50 Thousand Acres Oil Palm: 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగవుతున్నది.!
Also Watch: