Thamara Purugu Effect: మిరప పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రసాయనిక వ్యవసాయంలో ఏకపంటగా సాగవుతున్న ఈ పంటకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువే. పురుగుమందులను విస్తృతంగా పిచికారీ చేస్తున్నప్పటికీ భూతాపోన్నతి కారణంగా కొత్తరకం చీడపీడలూ కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో తామరపురుగుతో తీవ్రంగా నష్టదెబ్బతిన్న మిర్చి తోటలను బుధవారం హైదరాబాదులోని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారుల బృందం సందర్శించింది.
ఈ సందర్భంగా కొణిజర్ల మండలంలోని తనికెళ్ల, అంజనా పురం ఏన్కూరు మండలంలోని పలు గ్రామాలను కేంద్రీ య సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారులు ఎం.నీలారాణి, డాక్టర్ విద్యశ్రీ, రవిశంకర్ తదితరులు సందర్శించి తామరు పురుగు ఉధృతిని పరిశీలించారు. సమగ్ర సస్యరక్షణ, నివారణ చర్యలు గురించి రైతులకు తెలిపారు. తామర పురుగుతో మిర్చిపంటకు జరిగిననష్టాన్ని అంచనా వేశారు. తామరపురుగు నమూనాలను సేకరించారు.
Also Read: వేలాది ఎకరాల్లో పంట నష్టం…మిర్చి రైతులను నిండా ముంచిన తామర పురుగు
ఈ సందర్భం గా కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధికారి మాట్లాడుతూ తామర పురుగు సమస్య 2015నుంచి ఉందని, అయితే ఈ సంవత్సరం దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైందని తెలి పారు. తమ బృందం వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంజిల్లాల్లో మిర్చితోటలను పరిశీలించి తామరపురుగు నమూనాలు సేకిరించా మన్నారు.
హైదరాబాదు పరిశోధన ల్యాబ్‌కు ఈ నమూ నాలు పంపించి తామరపురుగుపై పరిశోధనలు చేస్తామని తెలిపారు. ఎక్కువగా పురుగుమందుల వాడడం వల్ల తామరపురుగు వ్యాప్తిచెందిందని, అలాకాకుండా బయో కెమికల్స్ రైతులు వాడాలని వివరించారు. మిర్చితోటలు వేసినప్పటినుంచి బయో కెమికల్స్ వాడాలని, తామరపురుగు వ్యాప్తిచెందిన తర్వాత బయెకెమికల్స్ వాడడం వల్ల ఉప యోగంలేదన్నారు.
Also Read: మామిడి రైతుల్ని నిండా ముంచిన తామర పురుగు..