Telangana International Seed Testing Authority (TISTA) Laboratory: దేశ స్థాయిలో ఉండే కేంద్ర (NSRTC) విత్తన పరీక్ష ల్యాబ్ తో పాటు, రాష్త్రాలలో ఉండే ఇతర విత్తన పరీక్ష ల్యాబ్ లను అత్యాధునిక అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. అందులో భాగంగా తెలంగాణ విత్తన ధృవీకరణ అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ (TISTA) ను భారత వ్యవసాయ శాఖ ప్రతునిధుల అద్యయన బృందం సందర్శించారు. అనంతరం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని భారత ప్రభుత్వ అధికారులు, విత్తన సంస్థల అధికారులు మరియు శాస్త్రవేత్తలతో కూడిన ఆద్యయన కమిటీ కలిసి భేటీ అయ్యారు.
Also Read: Buy Cow Dung Cake Online: ఆన్లైన్ ఆర్డర్ ద్వారా ఆవు పేడ సప్లై..

Minister Niranjan Reddy
సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హనుమంత్ జెండగే, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ, ఇస్టా ప్రెసిడెంట్ కేశవులు, డైరెక్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సీడ్ సైన్స్ (IISS, UP) డా.సంజయ్ కుమార్, ప్రొఫెసర్ డా, భాస్కరన్ (విత్తన సాంకేతిక శాస్త్రం, TNAU, కోయంబత్తూర్), దిలీప్ కుమార్ శ్రీవాస్తవా (డిప్యూటీ కమీషనర్, వ్యవసాయ శాఖ, భారత ప్రభుత్వం ), సుధాన్సు సింగ్, (డైరెక్టర్, దక్షిణ ఆసియా వరి పరిశోధన కేంద్రం, IRRI), MP యాదవ్ (విత్తన శాస్త్రవేత్త, NSRTC) తదితరులు పాల్గొన్నారు.
Also Read: Pure Ghee: స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడం ఎలా..?