Oil Palm Cultivation: 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం అని తెలంగాణ వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ఉందని తెలిపారు. ఏడాదిలో 52 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటి రికార్డ్ ని సృష్టించారు.
ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం గుబ్బగుత్తి గ్రామం రైతు దొడ్డపనేని వెంకటేశ్వర్ రావు 12 ఎకరాల ఆయిల్ పామ్ క్షేత్రాన్ని సందర్శించి, రైతును రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభినందించారు.
Also Read: Disease in Coconut: కొబ్బరితోటల్ని ఆశిస్తున్న సర్పిలాకార తెల్లదోమ యాజమాన్యం.!
రాబోయే మార్చి చివరి నాటికి మరో 70 వేల ఎకరాలలో మొక్కలు నాటడం పూర్తవుతుంది. రాబోయే ఏడాదికి సిద్దంగా కోటి ఆయిల్ పామ్ మొక్కలు నాటుతామని ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణలో మంచి భవిష్యత్ ఉందని.. ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఏడాదికి 22 మిలియన్ టన్నుల నూనె దేశానికి అవసరం కాగా కేవలం ఏడు మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందని ఏటా రూ.90 వేల కోట్ల పామాయిల్ దిగుమతి అవుతుందని అందుకే ఆయిల్ పామ్ సాగుతో పాటు నువ్వులు, కుసుమ, వేరుశెనగ తదితర నూనెగింజల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్ ఫెడ్ ద్వారా 458 ఎకరాల భూసేకరణ జరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Also Read: Tomato Products: టొమాటో ఆధారిత ఉత్పత్తుల తయారీ ఎలా చేస్తారు.!
Must Watch: