తెలంగాణ

Podu Pattalu: జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీ.. ఎన్నో సంవత్సరాల పోరాటానికి శాశ్వత పరిష్కారం..

2
Podu Pattalu will be distributed by TS Govt from June 24th to 30th
Podu Pattalu will be distributed by TS Govt from June 24th to 30th

Podu Pattalu: కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల సాగు సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ పోడు భూముల సమస్యకు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం నవంబర్ 2021లో అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి ఎస్ఆర్సీ కమిటీని నిర్వహించింది. ఈ ఎస్ఆర్సీ కమిటీలో పోడు భూముల సర్వే చేసారు. సర్వే ప్రకారం పోడు భూముల సాగు చేయడానికి గిరిజనులకు మాత్రమే హక్కు పట్టాలు ఇవ్వాలని ప్రకటించింది.

ప్రభుత్వం పోడు భూములపై మళ్ళీ సర్వే చేసి దరఖాస్తులను ఎస్ఆర్సీ కమిటీ , సబ్ డివిజనల్ కమిటీకి ఇచ్చింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అన్ని జిల్లా అధికారులు తుది జాబితాగా ఆమోద ముద్ర చేసారు. ప్రభుత్వం ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం పోడు హక్కుపత్రాలు, పాస్ పుస్తకాలను ముద్రించి గిరిజనులకు ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకున్నారు.

Also Read: Seed Treatment: ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌ ఫ్లోరెసెన్స్‌లతో విత్తనశుద్ధి ద్వారా వివిధ పంటలలో తెగుళ్ళ నివారణ.!

Podu Pattalu

Podu Pattalu

అటవీశాఖ అధికారులు ప్రతి జిల్లాలో 313 గ్రామపంచాయతీల పరిధిలో 717 ఆవాస గ్రామాల్లో పోడు సాగు చేస్తున్నారు అన్ని గుర్తించారు. పోడు రైతులు చాలా సంవత్సరాలుగా ఉన్న సమస్య పరిష్కారం కానుంది. దశాబ్ది ఉత్సవాల్లోనే రైతులకు హక్కు పట్టాలను ప్రభుత్వం అందిస్తుంది. పోడు భూముల పట్టతో పాటు, ఈ భూములకి రైతు బంధు పథకం కూడా అందిస్తాము అని ప్రభుత్వం చెప్పింది. ఈ నెల 24-30 వరకి పోడు భూముల పట్టాలు ఇవ్వాలి అని ప్రభుత్వం తెలిపింది. స్వయంగా సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చి పోడు పట్టాలు పంపిణీ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. వానాకాలం సీజన్ నుంచే రైతుబంధు, రైతు భీమా పథకాలు కూడా ఇస్తున్నారు. పోడు హక్కుపత్రాలు తీసుకునే రైతులు బ్యాంకు ఖాతాలు తీసుకోవాలి అన్ని ఆదేశాలు ఇచ్చారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శితో గ్రామాలకు వెళ్లి పోడు రైతుల వివరాలు సేకరించి వారితో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. పోడు హక్కు పట్టాల కోసం 83,341 దరఖాస్తులు వచాయి, వాటి పరిధిలో 2.97 లక్షల ఎకరాల భూములు సాగులో ఉన్నాయి, ఇందులో 65,616 మంది గిరిజనులు 2,41,102 ఎకరాలకు పట్టా దరఖాస్తు చేసారు వాటిలో కొన్ని కారణాలతో 15,021 దరఖాస్తులు తిరస్కరించారు. మిగితా 50,595 దరఖాస్తులు డీఎల్సీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అటవీ హక్కుల చట్టం – 2005 ప్రకారం గిరిజనేతరులు పోడు భూములపై హక్కులు పొందేందుకు మూడు తరాలుగా అటవీ ప్రాంతంలో నివసించాలి. అన్ని జిల్లాలో 17,725 గిరిజనుల దరఖాస్తులను జిల్లా కమిటీ పెండింగ్ పెట్టింది. ప్రస్తుతం కమిటీ నుంచి 50,595 దరఖాస్తులో 1,51,195 ఎకరాల భూములకు జూన్ 24 పోడు హక్కు పట్టాలు అందిస్తున్నారు.

Also Read: Drumstick Cultivation: మునగ సాగు.. రిస్క్ లేని పంట.!

Leave Your Comments

Seed Treatment: ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌ ఫ్లోరెసెన్స్‌లతో విత్తనశుద్ధి ద్వారా వివిధ పంటలలో తెగుళ్ళ నివారణ.!

Previous article

ANGRAU Foundation Day: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం- విత్తన మహోత్సవం

Next article

You may also like