Telangana Government: తెలంగాణ గిరిజన రైతులను చాలా కాలం నుండి పోడుభూముల విషయం పట్టి పీడుస్తుంది. ఈ పోడుభూముల విషయంలోగిరిజనలకు, అధికారులకు ఎన్నో గొడవలు, వాగ్వాదాలు జరిగిన ఘటనలు కోకోల్లలు ఉన్నాయి.
తెలంగాణాలో ఎన్నో చోట్ల పోడుభూముల కోసం రైతులు చేసిన అనేక నిరసనలు చాలా సార్లు వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఎట్టకేలకు పోడుభూముల విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఈ విషయంపైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం లోని నివసిస్తున్న గిరిజన ప్రాంతాల్లోని రైతులకు పోడుభూముల పంపిణీ చేసే కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న లక్షన్నర మంది గిరిజనులకు 4 లక్షల 6 వేల ఎకరాల పట్టాలు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ మహత్తర సంఘటనతో రైతుల ముఖాలు ఆనందం తో వెల్లివిరిస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భంలో తెలంగాణ మరొక మంచి శుభవార్త రైతులకు చేరవేసింది.
తాజాగా పోడు భూముల పట్టాలు అందుకున్న గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులను కేటాయించి విడుదల చేసింది. పోడుభూముల రైతులకు రానున్న రెండు రోజుల్లో అంటే జులై 5వ తేదీ నుంచి రైతుబంధు సాయం అందేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ విషయానికి సంబంధించి జులై 4వ తేదీవరకు అధికారులు వివరాలను నమోదు చేయనున్నారు. రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, మొబైల్ నంబర్, పట్టా నంబర్ వంటి ముఖ్య సమాచారాన్ని సేకరించి, వాటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకుని జులై 5వ తేదీన రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అంతేకాకుండా పోడుభూములపైన ఉన్నటువంటు కేసులను రద్దు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టాలు ఇచ్చిన తరువాత వాటి మీద ఎలాంటి కేసులు ఉండకూడదు అనే ఉద్దేశం తోనే ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫష్టం చేశారు. రాష్ట్ర డీజీపీకి ఈ మేరకు ఆదేశాలు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.
Also Read: Tomato Staking Method:స్టేకింగ్ పద్దతిలో టమాటా సాగు ఎలా చేయాలి.. ?