Oil Palm Cultivation: రైతులు ఎంత కస్టపడి జాగ్రత్తగా పంట పండించిన వారి శ్రమకి తగ్గిన ఫలితం రావడం లేదు. పంట పెట్టుబడి ఎక్కువ అవుతున్న దిగుబడి పై నమ్మకం రైతులకి రావడం లేదు. ఒకసారి వాతావరణం అనుకూలించక ఎక్కువ లేదా తక్కువ వర్షాలు పడటం. ఇంకోసారి పండించిన పంట మొలకలు రావడం. మరోసారి విత్తనాలలో నాణ్యత లేకపోవడం. ఇవి అన్ని చూసి రైతులు ఆలోచనలో కూడా మార్పు చేసుకొని మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలని మాత్రమే సాగు చేస్తున్నారు.
ప్రభుత్వం కూడా రైతుల సాగు కష్టాలను తెలుసుకొని వారికి లాభాలు వచ్చే పంటలు ఏవి వేయాలి, ఎలా సాగు చేయాలో సందేశాలు ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటోంది. తక్కువ పెట్టుబడి, లాభాదాయకం కూడా ఉండటంతో అన్ని జిల్లలో రైతులు ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహిస్తుంది.
Also Read: Cashew Nuts Price: తెల్ల బంగారంకి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలి.!
జిల్లాలోని నేలను పరిశీలించి ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉండే జిల్లాలలో ఈ సాగు మొదలు పెడుతుంది. చాలా జిల్లాలలో కొంత మంది రైతులు ప్రధాన పంటగా ఆయిల్ పామ్ సాగు చేస్తే, మరికొందరు రైతులు అంతర పంటగా ఆయిల్ పామ్ సాగుచేస్తున్నారు. రైతులు సాగుచేస్తున్న సంప్రదాయ పంటలు, పత్తి, సోయాబీన్, కంది పంటలకు ఎక్కువ పెట్టుబడి , దిగుబడి తగ్గడం. రైతులకి కూలీల కొరత ఉండడంతో రైతులు వాణిజ్య పంటల సాగు చేస్తున్నారు.
ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు రైతులకి అవగాహనతో పాటు డ్రిప్ ఏర్పాటు, మొక్కలు ఆదాయంకి ముందుగానే రాయితీల ఇస్తుంది. ప్రభుత్వం ప్రతి జిల్లాలో కొన్ని ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయాలి అన్ని జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులకి ఆదేశాలు ఇచ్చింది.
ఆయిల్ పామ్ పంటలో అంతర పంటగా పత్తి, కందులు, కూరగాయలు, సోయాబీన్, ఆకుకూరలు వేసుకోవచ్చు. ఈ పంటలతో కూడా రైతులు లాభాలు పొందుతారు. అంతర పంటగా సాగు చేసిన ఖర్చు తక్కువగా వస్తుంది. ఒకసారి ఈ ఆయిల్ పామ్ పంట కోతలు వస్తే రైతులు మంచి లాభాలు వస్తాయి అన్ని శాస్త్రవేత్తలు చెప్పారు. శాస్త్రవేత్తలు చెప్పడంతో ప్రభుత్వం వెంటనే రైతులకి సలహాలు ఇస్తు ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్నారు.
Also Read: Rice Under Threat: ప్రపంచాన్ని పోషించే వరి పంటకి ముప్పు.!