Novel ‘Uru Gani Uru’: హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో ప్రముఖ రచయిత కోట్ల వనజాత రచించి, తనకు అంకితమిచ్చిన 2022 తొలిసారి రాసిన నవల అంశంలో అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు అవార్డు పొందిన ‘ఊరుగాని ఊరు’ నవలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ గారు పాల్గొన్నారు. న్యాయవాది మనోహర్ రెడ్డి, కవి, రచయితలు సీతారాం, కె.పి.అశోక్ కుమార్, నాగవరం బలరాం, భీంపల్లి శ్రీకాంత్, నవలా రచయిత కోట్ల వనజాత తదితరులు హాజరైయ్యారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. చిద్రమైన గ్రామీణ జీవనంపై నవలలో వర్ణించిన తీరు హృద్యంగా ఉన్నది… పుట్టుక, జీవన విధానాలు ధ్వంసం చేయకుండా మార్పును ఆహ్వానించాలి, ఆఫ్రికా గ్రామీణ జీవనం వేల ఏళ్ల క్రితం ఎలా ఉన్నదో .. ఇప్పుడూ అలానే ఉన్నది .. దానిని కాపాడుకుంటూనే వారు ముందుకు సాగుతున్నారు అని మంత్రి అన్నారు.
గ్రామాలలో నవీనతను ఆహ్వానిస్తూనే పునాదులను కాపాడుకోవాలి. గతంలో గ్రామాలలోని మనుషుల ద్వారా ఊరి ఐక్యత, సంస్కృతి, అలవాట్లు ప్రతిబింబించేది. నేడు మారిన పరిస్థితుల్లో పట్టణాలు పల్లెలలో తిష్టవేశాయి .. గ్రామీణ మనుషుల ఆలోచన, ఐక్యతను ధ్వంసం చేశాయి. వ్యాపారాత్మక ధోరణులు పెరిగాయి. రచయితలు తమ రచనల ద్వారా గ్రామాలు కోల్పోయిన విలువలు, సంబంధాలు, ఐక్యతను గుర్తుచేసి విలువల పునరుద్దరణ కోసం దోహదపడాలి. కాల్పనిక రచనలు వేరు .. జీవితాన్ని ప్రతిబింబించే రచనలు వేరు. ఇలాంటి రచనలు అన్ని భాషలలో అనువాదమై అందరికీ చేరాలి. ‘ఊరు గాని ఊరు’ రచయిత వనజాతకు అభినందనలు, నాకు అంకితమిచ్చినందుకు ధన్యవాదాలు అని మంత్రి హర్షం వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం విషయంలో, స్త్రీల విషయంలో దృష్టికోణం మారాలి. అవసరమైన విషయాలు వదిలేసి, అనవసరమైన విషయాల మీద దృష్టిపెడ్తున్నారు. పర్యావరణం మీద టెన్ బర్గ్ మాదిరిగా దృష్టిపెట్టాలి. ఊరంటే అనుభవాల గూడు కాదు .. గ్రామాల విషయంలో గత ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వ దృష్టికోణం భిన్నంగా ఉన్నది. అంబలి, గంజి కేంద్రాలకు నిలయమైన ఎడారి లాంటి పాలమూరు నేడు పసిడి పంటలతో అలరారుతున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో మా ఊరికి రావొద్దు అని నేను కవిత రాశాను .. ఆనాడు ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మారిన గ్రామాల పరిస్థితిపై రచనలు రావాలి అని అన్నారు.
Also Watch: