ఆంధ్రప్రదేశ్తెలంగాణ

Scabies Control Methods In Lemon Orchards: నిమ్మ తోటల్లో గజ్జితెగులు అరికట్టే పద్ధతులు

0
Scabies Control Methods In Lemon Orchards
Lemon Orchards

Scabies Control Methods In Lemon Orchards: నాటిన 3వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ. ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయదిగుబడి వచ్చినప్పటికీ నవంబరు నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది. వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండ్‌ వుంటుంది కనుక, రైతుకు మంచి రేటు లభిస్తుంది.

Scabies Control Methods In Lemon Orchards

Lemon Orchards

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణతో పాటుకోస్తా జిల్లాల్లో నిమ్మతోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. నిమ్మ సాగులో అనేక రకాల చీడపీడలను రైతులు సులభంగా అధిగమిస్తున్నప్పటికీ, గజ్జితెగులు బెడదతో ఏడాది పొడవునా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ తెగులు వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా, పంట నాణ్యత తగ్గిపోయి, మార్కెట్‌లో సరైన ధర పొందలేకపోతున్నారు. సాధారణంగా ఈ తెగులు చెట్ల ఆకులు, పండ్లు మీద ఎక్కువగా కనిపిస్తుంది. మొదట ఆకుపై పసుపు పచ్చగా, చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి.

Scabies Control Methods In Lemon Orchards

Scabies

క్రమేపి ఈ మచ్చలు ఉబ్బెత్తుగా గరుకుగా, గజ్జి వలే కనిపిస్తాయి. ఆకులు పసుపు రంగుకు మారి, రాలిపోతాయి. కాయల మీద ఈ తెగులు లక్షణాలను గమనించినప్పుడు మచ్చలు ఉబ్బెత్తుగా వున్న ప్రాంతాల్లో జిగురు వంటి ద్రవం కారటం కనిపిస్తుంది. తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు కాయల్లో పగుళ్లు సంభవించటం కనిపిస్తుంది. కాయలు ముదరక ముందే రాలిపోతాయి. తెగులు తీవ్రమైనప్పుడు చెట్టులోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. ముళ్లమీద, పెద్ద కొమ్మల మీద, కాండం మీద చివరకు వేరుపై కూడా ఈ తెగులు సోకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. తెగులు ముదిరిన దశలో కొమ్మలు ఎండిపోయి చెట్టు క్షీణిస్తుంది.

గజ్జితెగులు నివారణకు రైతులు సమగ్ర యాజమాన్యం పాటించాలి. తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి వేయాలి. 1 గ్రాము స్ట్రెస్టోసైక్లిన్‌, 30 గ్రాములు బ్లైటాక్స్‌ 10 లీటర్ల నీటిలో కలిపి 20 రోజుల వ్యవధిలో 2 `3 సార్లు చెట్టంతా తడిచేటట్లు పిచికారి చేయాలి. చెట్ల మొదళ్ళపైన, పెద్దకొమ్మలపైనా గజ్జితెగులు ఉంటే, తెగులు ఉన్న బెరడును కత్తితో గోకివేసి బోర్డోపేస్ట్‌ పూయాలి.

తెగులును గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఈ తెగులు ప్రభావం దిగుబడిపై అంతగా వుండదు. ఏటా మే, జూన్‌ నెలల్లో ఎండుకొమ్మలను కత్తిరించి, చెట్లకు గాలి వెలుతురు దారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా వుంటాయి. కొత్తగా తోటలు వేసే రైతులు తెగులును తట్టుకునే బాలాజీ రకంతో పాటు అనేక హైబ్రీడ్‌ కొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలు, ఉద్యాన అదికారుల సలహాలతో ఎంచుకోవటం ఉత్తమం. ఈ విధమైన యాజమాన్యంతో ఈ తెగులును సమర్ధంగా అధిగమించి నిమ్మలో అధిక దిగుబడితోపాటు, నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు.

Leave Your Comments

Vegetable Cultivation: అర ఎకరంలో.. 16 రకాల కూరగాయల సాగు

Previous article

Methods To Increase Soil Carbon: నేలలో కర్బన ప్రతిక్షేపణ నిల్వలు పెంచే పద్ధతులు`ఆవశ్యకత

Next article

You may also like