Rythubandhu Latest News 2021 రైతుల్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బృహత్తర పథకం రైతుబంధు. ఈ పథకం ద్వారా వ్యవసాయ పెట్టుబడికి కావాల్సిన సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.అయితే ఇప్పటివరకు రైతుబంధు పాసు పుస్తకం లభించని వారు లక్షల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ వ్యవసాయ శాఖ రైతుబంధు ఆన్లైన్ వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ మేరకు కొత్తగా రైతుబంధు కోసం ఆన్లైన్ లో అప్లయ్ చేసుకుని పాసుపుస్తకం పొందవచ్చు.
News Rythubandhu Farmers కాగా.. కొత్తగా రైతుబంధు పాసు పుస్తకం పొందిన రైతులకు సీఎం కేసీఆర్ CM KCR సర్కార్ తీపి కబురు అందించింది ప్రస్తుత యాసంగి సీజన్‌లో వీరికి కూడా ‘రైతుబంధు పథకం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు సందర్భంగా రైతులు పాస్‌బుక్ లేదా తహసిల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పత్రం, ఆధార్‌కార్డు , బ్యాంక్ సేవింగ్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌లను జతచేయాలని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టా పాస్‌బుక్‌లు వచ్చిన రైతులు దాదాపు 2 లక్షల మంది ఉంటారని అంచనా. కాగా.. ఇప్పటికే స్కీం కింద పెట్టుబడి సాయం పొందుతున్న రైతులు అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. Rythubandhu Latest News 2021