తెలంగాణవార్తలు

Rythu Bandhu Varotsavalu: రైతు బంధు ఓ గేమ్ ఛేంజర్- మంత్రి నిరంజన్ రెడ్డి

5
Rythu Bandhu Varotsavalu

Rythu Bandhu Varotsavalu: తెలంగాణాలో పల్లెపల్లెన రైతుబంధు విజయోత్సవాలు జరుగుతున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ఆలేరులో నిర్వహించిన రైతు బంధు వారోత్సవాలల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెపల్లెనా రైతుబంధు విజయోత్సవాలు ఘనంగా సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పత్తి రైతుల మోములో చిరునవ్వులు పూయిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రస్తుతం పత్తి రైతులకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది. రాష్ట్రంలో విస్తృతంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు. గత ఏడాది 61 లక్షల ఎకరాలలో పత్తి సాగు అవ్వగా .. ఈ ఏడాది 40 లక్షల ఎకరాలకు పరిమితం అయ్యారని ఆయన అన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ CM KCR గారు, నేను పత్తి వేయాలని రైతులను కోరడం జరిగిందన్నారు.

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

ఇప్పుడు మార్కెట్‌లో పత్తి క్వింటాళ్లు రూ.9 నుండి రూ.10 వేలు ధర పలుకుతుంది. ప్రపంచ దేశాలలో పత్తి సాగు ఆశించినంతగా లేదు. కానీ తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. ఈ మేరకు రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపాలి. సాగునీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు ఎదురొచ్చి ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలలో వేయడం అపూర్వమైన విజయం. యూఎన్ఓ, ఆర్థిక వేత్తలు, వ్యవసాయ నిపుణులు రైతుబంధు ఒక గేమ్ చేంజర్ అని అభినందించారు. వ్యవసాయరంగంతో పాటు అన్ని రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

Also Read: తెలంగాణలో చామంతి సాగు విధానం..

Rythu Bandhu Varotsavalu

Rythu Bandhu Varotsavalu

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రకటించిన విధంగా కోటి ఎకరాలకు సాగునీరు మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు. రైతుల కోసమే ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నిరంతర తపన అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి గారు, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Vst శక్తి ట్రాక్టర్ ధరల జాబితా 2022

Leave Your Comments

Success Story: జామ సాగు – రైతు విజయగాధ

Previous article

Social Media in Agriculture: సాగుబడిలో సోషల్ మీడియా ఒరవడి.. టెక్నాలజీతో దూసుకెళ్తున్న రైతులు.!

Next article

You may also like