Raja Varaprasad: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా రాజావరప్రసాద్ గారిని నియమిస్తూ వ్యవసాయ మరియు సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా మోదల పురుషోత్తం, మహేష్ లను నియమించింది. రాష్ట్రంలోని రైతు, మత్స్య, గొర్రెలు, మేకలు, మహిళా తదితర అన్ని సంఘాలకు దిశానిర్దేశం చేసే కీలక పదవిలో వీరు కొనసాగనున్నారు. సహకార సంఘాల బలోపేతం, దాని ఆవశ్యకతను గుర్తుచేస్తూ రాజేంద్రనగర్ కేంద్రంగా నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాల బలోపేతం మీద దృష్టిపెట్టిన నేపథ్యంలో కీలక బాధ్యతలను వీరికి అప్పగించడంపై రాజావరప్రసాద్ గారు హర్షం వ్యక్తం చేశారు. 2001 నుండి పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన రాజావరప్రసాద్ 2001 నుండి 2007 వరకు షాద్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, 2007 నుండి 2010 యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010 నుండి 2016 వరకు ఉమ్మడి పాలమూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడుగా పనిచేశారు. 2009లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అరెస్టయినప్పుడు పెళ్లి పీటలపై నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు జైలు జీవితం, నిర్బంధాలను ఎదుర్కొన్న చరిత్ర రాజా వరప్రసాద్ గారిది.
Also Read: Mamnoor Kisan Mela 2023: మామునూరు కెవికె ఆధ్వర్యంలో కిసాన్ మేళ.!
పార్టీని అంటిపెట్టుకుని విధేయతతో ఉన్న ఉద్యమకారుడికి దక్కిన అవకాశం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తనను గుర్తించి బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సహకరించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి రాజావరప్రసాద్ గారు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ గా నియమితులైన రాజావరప్రసాద్ గారు, రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులుగా నియమితులైన తిరుమల మహేష్ గార్లు ఆదివారం సాయంత్రం, వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు .. ఈ సంధర్భంగా రాజావరప్రసాద్ కు, తిరుమల మహేష్ కు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా రాజావరప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను మంత్రి నిరంజన్ రెడ్డి గారి సహకారంతో చిత్తశుద్ధితో పనిచేసి సహకార సంఘాల బలోపేతానికి కృషిచేస్తానని అన్నారు.
Also Read: Soybean Pest Management: రబీ సోయా చిక్కుడులో ఆశించిన తెగుళ్ళు నివారణ