తెలంగాణ

PJTSAU 8th Foundation Day Celebrations: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 8వ వ్యవస్థాపక దినోత్సవం

1
PJTSAU 8th Foundation Day Celebrations
PJTSAU 8th Foundation Day Celebrations

PJTSAU 8th Foundation Day Celebrations: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 8వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. తొలుత వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ S. సుధీర్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వర్సిటీ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ ఎనిమిదేళ్లలో 4 కొత్త వ్యవసాయ కళాశాలలు, రెండు కృషి విజ్ఞాన కేంద్రాలతోపాటు అగ్రి హబ్, TAFE శిక్షణా కేంద్రాలు, అనేక ల్యాబ్ ల్ని ప్రారంభించినట్లు వివరించారు. ప్రతి యేటా Ag Bsc సీట్లు పెంచుతున్నామన్నారు.

వివిధ పంటలకి చెందిన 54 వంగడాల్ని విడుదల చేసినట్లు సుధీర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి “Innovating in education For india to be a global leader”అన్న అంశంపై ప్రసంగించారు.సమాజంలో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులది ముఖ్యభూమిక అని అన్నారు. అందరికి అన్నం పెట్టే రైతు లని “గ్రీన్ వారియర్స్” గా అభివర్ణించారు. ప్రస్తుతం వ్యవసాయం సహా అనేక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీలు వంటివి కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. పురాతన సంస్కృతులను బాగా అధ్యయనం చేయవలసి ఉందన్నారు. ప్రస్తుతం నైపుణ్యానికి అధిక ప్రాధాన్యత ఉందని మూర్తి వివరించారు.

PJTSAU 8th Foundation Day Celebrations

PJTSAU 8th Foundation Day Celebrations

Also Read: Innovating in Education for India to be a Global Leader: పిజె టిస్ ఎయూలో ఇన్నోవేటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియా టూ బీ ఏ గ్లోబల్ లీడర్ కార్యక్రమం.!

పరిశ్రమలు, విద్యాసంస్థలు పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక అవసరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా పరిశోధనలు, ఆవిష్కరణలు రూపొందించాలని సూచించారు. IIT హైదరాబాద్ కాలానుగుణంగా అనేక కొత్త కోర్సుల్ని ప్రారంభిస్తుందన్నారు. PJTASU, IIT హైదరాబాద్ పూర్తి భాగస్వామ్యంతో పని చేసి అనేక డిప్లమా, సర్టిఫికేట్, Phd కోర్సుల్ని ప్రారంభించవలసిన అవసరముందని మూర్తి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం నేడు అనేక కొత్త సవాళ్లను ఎ ఎదుర్కొంటుందని ACP, వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి ఉపకులపతి M. రఘునందన్ రావు అన్నారు.

ఒకప్పుడు అధిక వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతను సాధించడమే లక్ష్యంగా ఉండేదని కానీ నేడు పరిస్థితులు మారాయన్నారు. అధిక ఉత్పత్తి, ఉత్పాదకతలు సాధించడంతోపాటు రైతులకి లాభాలు చేకూర్చడం అన్నది కూడా నేడు చాలా ప్రధానమని అన్నారు. స్మార్ట్, ప్రెసిషన్ వ్యవసాయం వంటి అధునాతన టెక్నాలజీ లని రైతులకు చేరువ చేయాలని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థిని, విద్యార్థులకు, అభ్యుదయరైతులకి, బోధనా బోధనా, బోధనేతర సిబ్బందికి పురస్కారాలు అందజేశారు. కొన్ని ప్రచురణల్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, ఐ.సి.ఎ.ఆర్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: Agri Innovation Fest 2022: పిజె టిస్ ఎయూ లో అగ్రి ఇన్నోవేషన్ ఫెస్ట్ ప్రారంభం.!

Leave Your Comments

Disinfection in Sericulture: పట్టుపురుగుల పెంపకంలో రోగ నిరోధక చర్యలు.!

Previous article

Natural Enemies for Pest Control: పంటలపై పురుగులను నివారించే సహజ శత్రువుల గురించి మీకు తెలుసా.!

Next article

You may also like