PJTSAU: తెలంగాణ క్యాడర్ కు కేటాయించిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ IAS అధికారులు గురువారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంను సందర్శించారు. ప్రొబేషనరీ అధికారులు రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ తో పాటు విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమయ్యారు.
బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలలో విశ్వవిద్యాలయం చేస్తున్న కార్యక్రమాలను ప్రొబేషనరీ అధికారులకు రిజిస్ట్రార్ వివరించారు. విస్తరణ పరిశోధనా విభాగాలు, బోధనకు సంబంధించిన పలు అంశాలను IAS ట్రైనీలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన అగ్రి ఇన్ఫర్మేషన్ హబ్ ను సందర్శించారు.
Also Read: Soil Health Management: రాజేంద్రనగర్ PJTSAU లో భూసార ఆరోగ్య నిర్వహణ సదస్సు.!
రాజేంద్రనగర్ లోని పలు విభాగాలను ప్రొబేషనరీ అధికారులు సందర్శించారు. వరి, మొక్కజొన్న పరిశోధనా కేంద్రాలను వారు సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
అలాగే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్, ఫెస్టిసైడ్స్ రేసిడ్యువల్ ల్యాబ్, మిల్లెట్ ఇంకుబేషన్ సెంటర్, అగ్రి హబ్ లను కూడా వారు సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను వారు పరిశీలించారు. మొత్తం ఏడుగురు IAS ప్రొబేషనరీ అధికారులు విశ్వవిద్యాలయం పర్యటనలో పాల్గొన్నారు.