తెలంగాణ

Palamuru Rangareddy Lift Irrigation Scheme: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈనెల 16న ప్రారంభం.!

2
Palamuru Rangareddy Lift Irrigation Scheme
Palamuru Rangareddy Lift Irrigation Project

Palamuru Rangareddy Lift Irrigation Scheme: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నర్సాపూర్ పంప్ హౌస్ లో ఈనెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ మోటార్లు ప్రారంభించనున్న నేపథ్యంలో జరిగే బహిరంగసభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలిరావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈసందర్బంగా ఈశతాబ్దపు అతి పెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల .. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకం అని అన్నారు. పరాయి పాలన ఒక శాపం ! స్వపరిపాలన ఒక వరం !హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, కోటి మంది చంద్రబాబులు కొంగజపాలు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేస్తాను. పాలమూరు రైతుల కాళ్లను కృష్ణానది నీళ్లతో కడుగుతా, కృష్ణమ్మ నీళ్లను కలశాలలో గ్రామ, గ్రామానికి తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్ధనాలయాలలో అభిషేకం చేస్తామని కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన సందర్భంగా భూత్పూర్ బహిరంగసభలో 11.06.2015 రోజు అన్నారని దానిని చేసి చూపించారని మంత్రి అన్నారు.

అనంతరం జరిగిన పరిణామాలలో ఇంటిదొంగలు, పాలోల్లు, పక్క వాళ్లు కేసులు, ఈర్ష, ద్వేషాలతో కేసులు వేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకపోవడం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారిందన్నారు. ప్రాజెక్టు ముందుకు సాగకుండా అనేక రకాల అవరోధాలు కల్పించారన్నారు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లి రాజ్యాంగబద్ధంగా అనుమతులు సాధించారని, బ్యాంకులు రుణాలు ఇవ్వవు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు దాదాపు రూ.25 వేల కోట్లు దశలవారీగా కేటాయించుకుని అత్యంత అద్భుతంగా ప్రాజెక్టును పూర్తి తీసుకుంటున్నామన్నారు.

Also Read: Groundnut Insect Management: వేరుశనగలో రసం పీల్చు పురుగుల సమగ్ర యాజమాన్యం.!

Palamuru Rangareddy Lift Irrigation Scheme

Palamuru Rangareddy Lift Irrigation Scheme

ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పాలమూరు రంగారెడ్డి ఒక్కొక్కటీ 145 మెగావాట్ల మహా బాహుబలి పంపులని దశాబ్దాల క్రితమే కృష్ణా నీళ్లు పాలమూరుకు దక్కి ఉంటే దేశంలోనే ఒక హరితప్రాంతంగా, వ్యవసాయిక ప్రాంతంగా, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిలో అగ్రభాగాన ఉండే ప్రాంతంగా ఈ ప్రాంతం విలసిల్లేదని, ఈప్రాంత నేతల బానిస మనస్తత్వం, వెన్నెముక లేని తనం పాలమూరు ప్రజలకు శాపంగా నిలిచిందని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నిర్మించుకుని కృష్ణా నీళ్లను మలుపుకుంటున్నామని ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులు కూడా తెలంగాణ ప్రభుత్వంలోనే పూర్తిచేసుకున్నామని ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టుదలతో పూర్తి చేసుకున్నారని అన్నారు.

ఈ నెల 16న కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి పంపుల వెట్ రన్ తో పాలమూరు ప్రజల కల నెరవేరబోతున్నదని ఈ కార్యక్రమానికి ప్రజలు, రైతులు భారీ ఎత్తున బయలుదేరాలని కలశాలతో కృష్ణా నీళ్లు తీసుకువచ్చి గ్రామాలలో దేవాలయాల్లో దేవుళ్లను డప్పుచప్పుళ్లు, వాయిద్యాల నడుమ అభిషేకించాలని .. ప్రార్ధనాలయాలలో చల్లుకోవాలని సూచించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1600 పైచిలుకు గ్రామాల్లో ఈ సంబరాలు పెద్ద ఎత్తున జరగాలని కొట్లాడి తెలంగాణ సాధించుకున్నదే ప్రధానంగా సాగునీళ్ల కోసం కృష్ణా నీళ్ల కోసం తెలంగాణ జెండా ఖచ్చితమైన లక్ష్యంతో ముందుకుసాగిన ఈక్రమంలో ఎన్నో జయాపజయాలు ఎదుర్కొన్నామన్నాని ఈరోజు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగస్వామిని కావడం చిరస్మరణీయమైన అంశంగా భావిస్తున్నానమని అన్నారు.

నాఇంటికి కూడా కృష్ణమ్మ అని పేరు పెట్టుకున్నాను .. పాలమూరు ప్రజల ఆకలి, దాహార్తి తీర్చేది కృష్ణమ్మ అని ఆనాడు ఆ పేరు పెట్టుకున్నానమని ఈరోజు పాలమూరులో ప్రతి పల్లెకు కృష్ణమ్మ రాబోతున్నది .. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరం సంతోషంగా స్వాగతిద్దాం .. గర్వపడదామని మంత్రి అన్నారు. పార్టీలు, ప్రభుత్వాలకు అతీతంగా ప్రజల్లో సమూల మార్పుకు దోహదపడే అంశంగా దీనిని చూడాలనిఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పాలమూరుకు ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలను బహుమతి గా ఇచ్చి శాపంగా నిలిచారని తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ వరంగా ఇచ్చారని మంత్రి అన్నారు.

Also Read: Tomato Farmers: రైతును బికారి చేసిన టమాటా పంట.!

Leave Your Comments

Tomato Farmers: రైతును బికారి చేసిన టమాటా పంట.!

Previous article

Snake Gourd Farming: పొట్టి పొట్ల తో అధిక లాభాలు.!

Next article

You may also like