Wanaparthy: వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా సామూహిక పల్లెనిద్రలో ఆముదంబండ తండా, గార్లబండ తండాలో ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేసి ప్రజల సమస్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అడిగి తెలుసుకున్నారు.
సాగునీళ్లు, తాగునీళ్లు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, గృహాలు, పారిశ్రామిక అవసరాలకు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్ కిట్ – అమ్మవడి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా ఫించన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, మన ఊరు – మన బడి, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు, రోడ్ల నిర్మాణం, పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటు చేశామని అన్నారు.
గత ఎనిమిదేళ్లలో అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అని తెలిపారు. సాగు నీరు అందించి పంటల సాగును ప్రోత్సహించాం అని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పంటలు కొనుగోలు చేశాం అన్నారు.
Also Read: Palle Nidra: వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి – మంత్రి నిరంజన్ రెడ్డి.!
ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 చోట్ల ప్రభుత్వ అధికారులతో పల్లెనిద్రలు అనేది ఒక గొప్ప సందర్భానికి నాంది అన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్నో చేశాం చేశాం ? ఇంకా మీకు ఏం కావాలి ? మీ సమస్యలు ఏంటి ? పరిష్కారం చేసే బాధ్యత మాది అని ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు గ్రామాలు, పట్టణాలలో సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యం పెంచడం మా ఉద్దేశం అని ఆయన అన్నారు. మా ఆలోచనలను ప్రజలు స్వాగతించారు .. ఊరూరా వచ్చిన స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.
భవిష్యత్ లో అందరి సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పల్లెనిద్రలు నిర్వహిస్తాం అని నిరంజన్ రెడ్డి గారు పేర్కొన్నారు. 50 ఆవాసాలలో, 41 గ్రామాలలో, 9 మున్సిపల్ వార్డులలో, 7 మండలాలలో, 2 మున్సిపాలిటీలలో, 53 శాఖల అధికారులతో పల్లె నిద్రల కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషిచేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలకు వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు.