Minister Niranjan Reddy: తెలంగాణ రైతాంగానికి అంతరాయం లేకుండా కరెంటు అందజేస్తూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. సాగునీటి రాకతో రాష్ట్రంలో వరిసాగు పెద్ద ఎత్తున పెరిగిందన్నారు. ఈఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నా వానాకాలంలో ఇప్పటి వరకు 57.51 లక్షల ఎకరాలలో వరి, 44.73 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారన్నారు. వరితో పాటు ఇప్పటి వరకు 5.28 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 4.61 లక్షల ఎకరాలలో కందులు సాగు చేశారన్నారు. మొత్తం రాష్ట్రంలో 1.18 కోట్ల ఎకరాలలో వివిధ రకాల వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారని మంత్రి చేశారు.
భూగర్భ జలవనరులు పెరగడం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు మూలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద భరోసాతో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. సెప్టెంబరు 1న 14,747 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే రోజు 11,198 మెగావాట్ల విద్యుత్ నమోదవడం గమనార్హం . అయినా రైతాంగానికి కరెంటు విషయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చూస్తున్నది. వరుణుడు కరుణించడంతో నిన్న రాష్ట్రంలో 8891 మెగావాట్ల విద్యుత్ డిమాండ్, ఈ రోజు 7414 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయిందని మంత్రి అన్నారు. ఈఏడాది కృష్ణా బేసిన్ లో వర్షాలు లేకున్నా డిమాండ్ కు సరిపడా కరెంటు సరఫరా చేశారు రాష్ట్రంలో మొత్తం కరంటు వినియోగంలో వ్యవసాయ రంగం 35 నుండి 40 శాతం వాటా నమోదవుతున్నాయి. దేశంలో అత్యధిక శాతం వ్యవసాయ రంగానికి కరెంటు వినియోగించుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు.

Agri Minister Niranjan Reddy
తెలంగాణ భవిష్యత్ చాలా ప్రణాళికాబద్దంగా ఉన్నదని . తెలంగాణ ప్రభుత్వ చర్యల మూలంగా వ్యవసాయరంగంలో సాగు మరియు పంటల ఉత్పత్తి పెద్దఎత్తున పెరిగిందన్నారు. రైతు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడని. రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు కేవలం మద్దతు ధర కోసం ప్రభుత్వం మీద ఆధారపడకుండా రైతు తన పంటకు తానే గిట్టుబాటు ధర నిర్ణయించుకునే విధంగా ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు సాగుతున్నది. ఆ దిశగా ఇది వరకే చర్యలు చేపట్టింది. దీంతో పాటు సహకార పద్దతిలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.
వ్యవసాయ యాంత్రీకరణకు మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే దృష్టిపెట్టారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా భావించి భవిష్యత్ తరాలు దానిని వృత్తిలా ఎంచుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకనాటికి తెలంగాణ రైతాంగం రుణగ్రస్తులుగా రుణమాఫీల కోసం ఎదురుచూసే రైతులుగా కాకుండా రుణాలు ఇచ్చే రైతులు గా నిలబడాలన్నది కేసీఆర్ కల. ఆకాంక్ష అని మంత్రి అన్నారు.
Also Read: Oil Palm Cultivation: తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు భళా.!