Minister Niranjan Reddy: సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి గారు హాజరయ్యారు.
తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయింది. సాగు నీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్లతో రైతులలో ఆత్మస్థయిర్యం పెరిగింది. కాని యాసంగి వరి పంట కోతల ఆలస్యం మూలంగా అకాల వర్షాలతో జరిగే నష్టం రైతుకే కాదు ప్రభుత్వానికి కూడా నష్టమే. ఈ నష్టం నివారించడానికి గత క్యాబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకు నష్టాలు నివారించడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలనకు మంత్రి వర్గ ఉపసంఘం నియమించారు.
యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం కోరింది. వీటిపై వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించిన నేపథ్యంలో సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమయినది. యాసంగి సాగులో యాజమాన్య పద్దతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగుపై , ఇతర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులతో మంత్రి వర్గ ఉప సంఘం విస్తృత చర్చ జరిపింది. తదుపరి సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రుల సూచించారు.
Narendra Singh Tomar: భారతదేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది – కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్