Minister Niranjan Reddy: తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రూ.లక్ష 21 వేల కోట్లు , 6.71 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంను తెలంగాణ ప్రభుత్వంకొనుగోలు చేసింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో పంజాబ్ తరువాత స్థానం మనదే అని యాసంగి వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో మనం నంబర్ వన్ స్థానంలో ఉంది అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నిధులు సమకూర్చుకుని ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లిస్తున్నది. ధాన్యం మిల్లులకు వెళ్లిన తర్వాత అక్కడి నుండి బియ్యం కేంద్రానికి చేరిన తర్వాత దాదాపు నాలుగు నెలల సమయం తీసుకుని కేంద్రం రాష్ట్రాలకు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నది .. ఈ రోజుకు కేంద్రం నుండి రూ.370 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నది. కరోనా విపత్తు వంటి కీలక సమయంలో ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ప్రభుత్వం ధాన్యం సేకరించింది అని మంత్రి అన్నారు.
ముడిబియ్యం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం నిబంధన పెట్టిన నేపథ్యంలో గత ఏడాది ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు రైతులు వరి సాగును తగ్గించారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ద విధానాల మూలంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేఫథ్యంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించడం జరుగుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నూతనంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 61 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగింది.
Also Read: Pachagavya: మొక్కలకు పంచామృతం ఈ ‘పంచగవ్య’
ఆయిల్ పామ్ మొక్కల నాణ్యత విషయంలో అనుమానాలు అవసరం లేదు. నకిలీ విత్తనాలపై పీడీ యాక్ట్ .. ఇప్పటి వరకు 16 పీడీ యాక్ట్ కేసులు నమోదు చెయ్యడం జరిగింది. రాష్ట్రంలో నకిలీ విత్తనాల బారిన రైతాంగం పడకుండా చర్యలు తీసుకున్నాం .. టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ లతో దాడులు నిర్వహించడం జరుగుతున్నది.
సకాలంలో రైతాంగానికి విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం. విత్తనాలు, ఎరువుల నాణ్యతా ప్రమాణాల పరీక్ష కోసం రాష్ట్రంలో ఏడు ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు నాణ్యమైన వేరుశెనగ వంగడాలను అందించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి .. రాబోయే రెండేళ్లలో ఇవి అందుబాటులోకి రానున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వనపర్తి జిల్లా వీరాయపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వేరుశెనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు పనులు నడుస్తున్నాయి. శాసనమండలి ప్రశ్నోత్తరాల సంధర్భంగా సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలు రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కేంద్రం పాత్ర, నకిలీ విత్తనాలు, ఎరువులపై తీసుకుంటున్న చర్యలు, ఆయిల్ పామ్ సాగుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు.
Also Read: Flower Tea: నయా ట్రెండీ ఫ్లవర్ ‘టీ’.!