Minister Niranjan Reddy: తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాలలో భాగంగా వనపర్తి బాలకిష్డయ్య క్రీడాప్రాంగణంలో మత్స్య శాఖ ఏర్పాటు చేసిన ఫిష్ ఫెస్టివల్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో సమృద్ధిగా చేపలు దొరుకుతున్నాయని ప్రతి గ్రామంలో కృష్ణా నీళ్లతో నిండుగా చెరువులు కళకళలాడుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం వస్తే ఎప్పుడో ఒకసారి చేపలు వచ్చేవాని తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన వారు అక్కడి నుండి తెచ్చి చేపలు అమ్మేవారని మంత్రి చెప్పారు.
Also Read: Inter Cropping: చెరకుతో పాటు ఈ రెండు పంటలను సాగు చేస్తే రెట్టింపు ఆదాయం.!
ఇప్పుడు మిషన్ కాకతీయతో చెరువులు బాగయ్యాక చెరువు సామర్ధ్యాన్ని బట్టి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు విడుస్తున్నది. నేడు ప్రజలకు అందుబాటులో చేపలు ఉండటమే కాకుండా ఇతర రాష్ట్రాలకు పెద్దఎత్తున తెలంగాణ చేపలు సరఫరా చేస్తున్నారని తెలంగాణలో చేప మాంసం వినియోగం పెద్ద ఎత్తున పెంచాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
చికెన్, మటన్ వినియోగం తగ్గించాలని తెలంగాణలో తొలి మత్స్య కళాశాల పెబ్బేరులో ఏర్పాటు చేశాం .. తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లిపోయిందని మత్య్స కళాశాల విద్యార్థులు స్వయంగా చేపల వినియోగం పెంచేందుకు వంటలు తయారుచేసి అమ్మడం అభినందనీయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మత్య్స సహకార సంఘంలోని సోదర, సోదరీమణులు ఉచిత చేప పిల్లలతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మంత్రి అన్నారు.
Also Read: Fish Farming: వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!