తెలంగాణ

Minister Niranjan Reddy: రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి

1
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలని ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మే 24, 2023న రాజేంద్రనగర్ లో విత్తనమేళాను నిర్వహిస్తోంది. ఈ మేళాలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు రాజేంద్రనగర్ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సంస్థలు (IIOR, IIMR, IIRR, CRIDA), ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ, ఉద్యాన మరియు అనుబంధ శాఖలు (TSSDC, NSC, TSSOCA) పాల్గొంటున్నాయి. అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, (జగిత్యాల, పాలెం మరియు వరంగల్), వ్యవసాయ పరిశోధనా స్థానాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు పరిశోధనా సంచాలకులు డాక్టర్ వెంకటరమణ తెలిపారు. పది పంటలలో 45 వంగడాలకు సంబంధించి 15 వేల క్వింటాళ్ల విత్తనాలను విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు.

ఈ విత్తన మేళాలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూపొందించిన వివిధ వంగడాలు అనగా వరిలో 10 సన్నగింజ రకాలు ఆర్.ఎన్.ఆర్ 15048, డబ్ల్యు. జి. ఎల్ – 44, డబ్ల్యు. జి. ఎల్ – 962, కె.ఎన్.ఎమ్ 1638, జె.జి.ఎల్ – 28545, జె.జి.ఎల్ -27356, ఆర్.ఎన్.ఆర్-2465, ఆర్.ఎన్. ఆర్- 11718, బి.పి.టి- 5204, కె.పి.ఎస్ -2874, దొడ్డు గింజ రకాలు (4 రకాలు), కె.ఎన్.ఎమ్ 118, ఎమ్.టి.యు 1010, డబ్ల్యు.జి.ఎల్-915, జె.జి.యల్. 24423, సువాసన కలిగిన రకం (1) ఆర్.ఎన్.ఆర్ -15435, మొక్కజొన్నలో (3 హైబ్రిడ్స్) డి.హెచ్.యం 117, డి.హెచ్.యం 121, కరీంనగర్ మక్క-1, ఆముదంలో పి.సి. హెచ్ 111 విత్తనాలను అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

Minister Niranjan Reddy said that quality seed should be provided to the farmers

Minister Niranjan Reddy said that quality seed should be provided to the farmers

అపరాల పంటలైన పెసరలో (6 రకాలు) యాదాద్రి (డబ్ల్యు.జి.జి. 42), ఎమ్.జి.జి 295, ఎమ్.జి.జి. 347, ఎమ్.జి.జి 351, ఎమ్.జి.జి 385, బి.పి.యమ్ -2-14; మినుములో (6 రకాలు) పి.యు 31, టి.బి.జి- 104, ఎల్.బి.జి-752, ఎం.బి.జి-1070, వి.బి.ఎన్-8, జి.బి.జి-1, కందిలో (7 రకాలు) హనుమ, డబ్ల్యు.ఆర్.జి. ఇ- 97, డబ్ల్యు.ఆర్.జి-255, పి.ఆర్.జి-176, ఎం.ఆర్.జి-1004, ఎం.ఆర్.జి-66, టి.డి.ఆర్.జి-59, జొన్నలో (2 రకాలు) పి.వై.పి.ఎస్-2, సి.ఎస్.వి-41, సోయాచిక్కుడులో (4 రకాలు) బాసర, కె.డి.ఎస్-726, ఎం.ఎ.యు.యస్-612, ఎ.ఐ.ఎస్.బి-15 మరియు పశుగ్రాస పంటల విత్తనాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూపొందించిన జీవన ఎరువులు మరియు చీడపీడల నివారణలో వాడే పరాన్న జీవులు మొదలైనవి రైతుల కొనుగోలు నిమిత్తం అందుబాటులో ఉంటాయి.

దీంతోపాటు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతపై రైతుల సందేహాలు తీర్చడానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్టి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడానికి వీలుగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలతో కూడిన వ్యవసాయ ప్రదర్శన కూడా అదే రోజున నిర్వహిస్తున్నారు. కావున రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విత్తనమేల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఈ విత్తనమేలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం సమీపంలో ఈ విత్తనమేలను నిర్వహిస్తున్నారు.

Also Read: Minister Niranjan Reddy: తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయింది – మంత్రి నిరంజన్ రెడ్డి

Seed Mela 2023: ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ లో జరిగిన “విత్తన మేళా – 2023”

Leave Your Comments

Minister Niranjan Reddy: తెలంగాణ రాకతో వ్యవసాయ రంగ స్వరూపం మారిపోయింది – మంత్రి నిరంజన్ రెడ్డి

Previous article

PJTSAU: అటవి జీవ వైవిధ్య సంస్థతో PJTSAU ఒప్పందం

Next article

You may also like