Samunnati Light House FPO Conclave 2023: హైదరాబాద్ కన్హా శాంతివనంలో సమున్నతి సంస్థ నిర్వహించిన ‘లైట్ హౌస్ కంక్లేవ్ ఎఫ్ పీ ఓ 2023’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమున్నతి సంస్థ సీఈఓ అనిల్ కుమార్, డైరెక్టర్ ప్రవేశ్ శర్మ, డాక్టర్ వెంకటేష్ తగత్, ఏపీఎంఏఎస్ సీఈఓ సీఎస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Samunnati Light House FPO Conclave 2023
ఆధునిక పరిశ్రమగా వ్యవసాయం వర్ధిల్లాలి. సాంప్రదాయ వ్యవసాయం నుండి రైతాంగం బయటకు రావాలి. ఆ దిశగా అందరూ ఆలోచిస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. భవిష్యత్‌లో ప్రపంచానికి ఆహారం అందించేది భారతదేశమే అని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు.
Also Read: Indoor Plants: మీ ఇంటిలో ఈ మొక్కలని పెంచండి… స్వచ్ఛమైన గాలిని పీల్చండి.!
మనది వ్యవసాయిక దేశం. తెలంగాణలో రైతు ఉత్పత్తి సంఘాలకు ప్రోత్సాహం లభించడం ఆనంద దాయకమని భవిష్యత్ మీద గొప్ప ఆశతో విద్యాధికులైన వ్యవసాయ నిపుణులు వ్యవసాయం మీద ప్రేమతో చేయడం, చేయిస్తుండడం సంతోషదాయకంమని మంత్రి హర్షం వ్యక్తం చేసారు.

Minister Niranjan Reddy
రైతు ఉత్పత్తిదారుల సంస్థల సంఖ్య మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. సమున్నతి సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 180 కి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం అభినందనీయం అని రైతు ఉత్పత్తిదారుల విజయగాధలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, రైతులు ఉత్పత్తి చేసే వ్యవసాయ పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేయడం, రైతులకు లాభదాయకంగా మార్చడం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై సుధీర్ఘమైన చర్చ చేయడం ఆశించదగిన పరిణామం మంత్రి అన్నారు. సామూహిక ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలతో పెట్టుబడి తగ్గి రైతుకు లాభం జరుగుతుందని వారు చెబుతున్నారని వెల్లడించారు.
Also Read: Yellow Watermelon: పసుపు వాటర్ మెలోన్ని మీరు చూశారా..?