Minister Niranjan Reddy: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లె గ్రామంలో అక్షయ అగ్రి మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు సందర్శించారు.
ప్రపంచానికి అన్నం పెట్టే శక్తి భారతదేశానిది. ఏడున్నర దశాబ్దాలుగా దీనిని సద్వినియోగం చేసుకోలేదు. ప్రజలకు కంట్రోలు బియ్యం ఇచ్చి కడుపు నింపడమే మహాభాగ్యంగా భావించి పాలకులు చేతులు దులుపుకున్నారు. ఇక్కడి వనరులను ఉపయోగించుకుని అద్భుతమైన సంపద సృష్టించి ప్రపంచానికి అందించాలన్న దిశగా ఆలోచనలు జరగలేదు. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నాయి.

Telangana Agriculture Minister Niranjan Reddy Akshaya Agri Manufacturing Unit
పప్పుదినుసులు, నూనె గింజలు ఇప్పటికీ దిగుమతి చేసుకునే పరిస్థితులు ఏటేటా తరగాల్సింది పోయి పెరుగుతుండడం దురదృష్టకరం. ఏటా దిగుమతులు తగ్గించుకుని దేశంలో ఉత్పత్తులు పెంచుకోవాలన్న ప్రణాళిక లేకపోవడం గమనార్హం. దేశంలోని మొత్తం భూమిని క్రాప్ కాలనీలుగా విభజించాలని మొదటి నుండి చెబుతున్నాం.
Also Read: Crop Protection: అకాల వర్షాల సమయంలో వరి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Minister Niranjan Reddy
ఆయా భూభాగాలు, ప్రాంతాలు, పరిస్థితులకు అనుగుణంగా పండే పంటలు, వాటికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ కు సంబంధించి సమగ్ర వ్యవసాయ విధానం దేశానికి అవసరం అని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, కరంటు, పెట్టుబడి ఇచ్చి, భీమా ఇచ్చి ,పంటల సాగును ప్రోత్సహించి, మార్కెట్ లో పంటలను కొనుగోలు చేస్తున్నాం. అయితే అంతిమంగా తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం. తెలంగాణలో పండిన పంటలకు పక్క రాష్ట్రాల్లో పండిన పంటలు పోటీ కావచ్చు. అందుకే దేశంలోని రాష్ట్రాల్లో పండే పంటల మధ్య పోటీ కాకుండా దేశంలో పండే పంటలకు ప్రపంచ మార్కెట్ తో పోటీ ఉండేలా, పోటీలో నిలిచేలా మన దేశ వ్యవసాయ విధానం ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
దేశ వ్యవసాయ విధానం మారితేనే మట్టిని నమ్ముకున్న రైతులు వ్యవసాయాన్ని పరిశ్రమలా ముందుకు తీసుకెళ్లగలుగుతారు అలాంటి విధానం లేకపోవడం వల్ల రైతులు కేవలం బతుకుదెరువు కొరకు అన్నట్లు సాంప్రదాయ వ్యవసాయంలో మగ్గిపోతున్నారని మంత్రి అన్నారు.
Also Read: Minister Niranjan Reddy: రైతులకు ప్రతి రోజూ కేసీఆర్ జన్మదినమే – మంత్రి నిరంజన్ రెడ్డి