Minister Niranjan Reddy: నాణ్యమైన దిగుబడి, రైతుల ఆదాయం పెంచేందుకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల పాత్రపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, రిజిస్ట్రార్ వెంకటరమణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ రఘురాంరెడ్డి, ధనూకా చైర్మన్ ఆర్ జి అగర్వాల్, ఏసీఎఫ్ఐ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పోషకాలు, క్రిమిసంహారక మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన ఉత్పత్తుల వాడకంతోనే నాణ్యమైన దిగుబడులు వస్తాయని.. నాసిరకం మందులు, ఎరువుల వాడకాన్ని కలిసికట్టుగా నిరోధించాలని మంత్రి అన్నారు.
Also Read: Intercropping: రెండు సంవత్సరాలో నాలుగు అంతర పంటలని పండించడం ఎలా…?
రైతులు వ్యాపారులను నమ్మి ఉత్పత్తులు కొంటారని.. అలాంటి రైతులను ఎవరూ మోసం చేయవద్దని ఈ విషయంలో ఉత్పత్తిదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎరువులు, పురుగుమందులలో నాణ్యమైనవి గుర్తించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం అని మంత్రి వెల్లడించారు. జిల్లాలలో రైతులకు ఈ విషయంలో చైతన్యం చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సదస్సుకు హాజరైన రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేసారు.