తెలంగాణ

Minister Niranjan Reddy: మెట్ట భూములను మెరుగు పరచాలి – మంత్రి నిరంజన్ రెడ్డి 

2
State Agriculture Minister Singireddy Niranjan Reddy
State Agriculture Minister Singireddy Niranjan Reddy

Minister Niranjan Reddy: మెట్టభూముల మెరుగు పరిచే అంశంపై ఇక్రిశాట్ లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యులు రమేష్ చంద్,  ఇక్రిషాట్ డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్, ఇక్రిషాట్ డీడీజీ డాక్టర్ అరవింద్ కుమార్ మరియు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు శాస్త్రవేత్తలు హాజరయ్యారు.

ప్రస్తుత పరిస్థితులలో మెట్ట భూములను మెరుగు పరచడం అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 50 శాతం మెట్ట భూముల నుండే వస్తుంది. భూమిపై 40 శాతం మెట్ట భూముల నేలలే ఉన్నాయి. ఇవి ఊష్ణ,  సమశీతోష్ణ మండలాలలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. మారుతున్న వాతారవరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆహార భద్రత, జీవవైవిధ్యం, సన్న, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్టభూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

ఈ పరిస్థితులలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు మెట్టభూముల పరిస్థితిని మెరుగుపరిచి సుస్థిర వ్యవసాయానికి దారులు వేయాలి. అందులో భాగంగా జరిగే పరిశోధన ఫలితాలు దీర్ఘకాలం పాటు వాతావరణ పరిస్థితులను మారుస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులను సంరక్షించాలి.

Also Read: Pradhan Mantri Kisan Maandhan Yojana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్..!

పర్యావరణ పరిరక్షణకు, పోషక భద్రతకు, పేదల ఆకలి తీర్చడానికి మెట్టభూములపై పరిశోధనలు చేస్తున్న ఇక్రిషాట్ సేవలు అభినందనీయం. గత 50 ఏళ్లుగా ఇక్రిషాట్ సేవలు ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఎందరికో మేలు చేయడం గర్వకారణం. రాబోయే కాలంలో మెట్టభూములు మెరుగు పరిచేందుకు నూతన సాంకేతికతను  సృష్టించేందుకు ఈ సదస్సు తోడ్పడుతుందని ఆశిస్తున్నాను అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

State Agriculture Minister Singireddy Niranjan Reddy participated as the chief guest in the international conference held at ICRISAT

State Agriculture Minister Singireddy Niranjan Reddy participated as the chief guest in the international conference held at ICRISAT

తెలంగాణలో మెట్ట భూములు మెరుగు పరిచే అంశం మీద సదస్సు నిర్వహించడం అభినందనీయం అని ఈ సదస్సులో వచ్చే ఫలితాలు జీవ వైవిధ్యానికి ఉన్న ముప్పును, తగ్గుతున్న నేల ఆరోగ్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, కుచించుకు పోతున్న వ్యవసాయ ఉత్పాదతకు సరైన సమాధానాలు రాబడతాయని భావిస్తున్నాను అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశోధనలన్నీ నేలలో ఉండే కర్భన శాతాన్ని, నేల జీవ వైవిధ్యాన్ని మెరుగు పరుస్తాయని నమ్ముతున్నాను. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలిసి పరస్పర సహకారంతో ఈ దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మెట్ట భూముల సమస్యలపై ప్రాంతాల వారీగా నిర్ధిష్ట పరిశోధనా ఫలితాలను విడుదల చేయాలి అని మంత్రి తెలిపారు.

Also Read: Minister Niranjan Reddy: దేశానికి నూతన వ్యవసాయ విధానం అత్యవసరం – మంత్రి నిరంజన్ రెడ్డి

Leave Your Comments

Pradhan Mantri Kisan Maandhan Yojana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్..!

Previous article

CM Jagan Mohan Reddy: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.!

Next article

You may also like