తెలంగాణ

Minister Niranjan Reddy: మన తెలంగాణ దేశానికే అన్నపూర్ణ – మంత్రి నిరంజన్ రెడ్డి

2
Minister Niranjan Reddy
Minister Niranjan Reddy

Minister Niranjan Reddy: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా రాష్ట్ర రైతులు, రైతు కూలీలు, ప్రజలకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపుతో సాధించిన విజయమిది. రైతుబంధు రైతుల పెట్టుబడి బాధలు తీర్చి రైతుభీమా రైతులలో ఆత్మస్థయిర్యం నింపిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 24 గంటల ఉచిత కరంటు రైతులకు భరోసానిచ్చిందని సాగునీరు వారిలో నమ్మకాన్ని పెంచిందని మంత్రి అన్నారు.

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం, మద్దతుధరకు 100 శాతం పంటలు కొనుగోలు చేయడం ఒక్క తెలంగాణకే సాధ్యమయిందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు విజయవంతంగా అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని మంత్రి సగర్వంగా తెలిపారు.

Also Read: Green Manure: సేంద్రియ వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రాధాన్యత.!

State Agriculture Minister Singireddy Niranjan Reddy congratulated the farmers, farm laborers and people of the state on the occasion of Telangana Dashabdi Utsavalu

State Agriculture Minister Singireddy Niranjan Reddy congratulated the farmers, farm laborers and people of the state on the occasion of Telangana Dashabdi Utsavalu

రూ.65 వేల కోట్లు రైతుబంధు కింద జమచేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని రైతుభీమా కింద లక్ష మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమయిందని మంత్రి అన్నారు. ఏటా రూ.10,500 కోట్ల భారంతో ఉచిత విద్యుత్ అమలు చేసున్నామని తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని కాళేశ్వరం రైతుల తలరాత మార్చిందని మంత్రి తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ రైతులకు ఉపకరిస్తుందని పదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మారిందని తెలంగాణ వ్యవసాయ అనుకూల పథకాలు అమలుచేయాలని అన్ని రాష్ట్రాల రైతులు డిమాండ్ చేస్తున్నారని మహారాష్ట్రలో మార్పు మొదలయింది .. సమీపకాలంలో దేశమంతా ఇదే జరుగుతుందని కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరం అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా అన్నారు.

Also Read: Cow Dung: ఆవుపేడతో కాగితం తయారీ.!

Leave Your Comments

Green Manure: సేంద్రియ వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రాధాన్యత.!

Previous article

Aeroponics Saffron Farming: మట్టి లేకుండా కుంకుమ పువ్వు సాగు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Next article

You may also like