తెలంగాణ

ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో సమరానికి సిద్ధం: మంత్రి నిరంజన్ రెడ్డి

0
niranjan reddy

niranjan reddy

Paddy Issue : Minister Niranjan Reddy Confirms Ministers Off To Delhi మిగులు ధాన్యాన్ని సేకరించాలని కోరుతూ నేడు మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు తెలంగాణ మంత్రులు, ఎంపీలు. శుక్రవారం సీఎం కేసీరఆర్ అధ్యక్షతన జరిగిన భేటీ అనంతరం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం సాగిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల్ని కేంద్రం తీవ్రంగా నష్టపరుస్తుందన్న మంత్రి, కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు నష్టపోతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ యాసంగి పంటను సేకరించాలని కేంద్రాన్ని కోరుతూ తెరాస ఎంపీలు పార్లమెంటు బయట, లోపల అలుపెరగని పోరాటం చేశారని, కానీ కేంద్రంలో ఒకింతైన మార్పు కనిపించలేదన్నారు.

kcr

kcr

Paddy Procurement ఇప్పటివరకు 60 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, అయితే మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలన్నారు మంత్రి. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి మరోసారి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేదాకా పోరాడతాం. గతంలో అంతా కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కానీ, కేంద్రం రాత పూర్వకంగా ఇచ్చిన వాటికే ప్రస్తుతం దిక్కులేదని ఎద్దేవా చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Paddy Issue

Paddy Issue

ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎఫ్‌సీఐ, గోదాంలు ,రైళ్లు కేంద్రం పరిథిలో ఉన్నందున బియ్యం కూడా కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రం బియ్యం సేకరించకుండా రాష్ట్రం మీద నిందలు వేయడం సరికాదన్నారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం కాకుండా మిగులు బియ్యాన్ని సేకరించాలని. ఇంకా కోతలు జరగాల్సింది ఉందని, కోసిన ధాన్యం కొంత కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఆ ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్ణయం ఏమిటో రాతపూర్వకంగా చెప్పాలని అడిగేందుకు మరోసారి ఢిల్లీకి వెళ్తామని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. Minister Niranjan Reddy

Paddy Issue

CM KCR సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రైతు సమితి అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లన్లు పాల్గొన్నారు. కాగా.. మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మంత్రులు గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌, టీఆర్‌ఎ్‌సఎల్పీ నేత నామా నాగేశ్వర్‌ రావు, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఇతర పార్లమెంటు సభ్యులతో కూడిన బృందం నేడు ఢిల్లీ బాట పట్టింది. Telangana Paddy Procure Issue 

Leave Your Comments

రైతుబంధుపై సీఎం కేసీఆర్ స్పష్టత

Previous article

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

Next article

You may also like