Minister Niranjan Reddy: హైదరాబాద్ సచివాలయంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, అగ్రోస్ ఎండీ రాములు, ఉద్యానశాఖ జేడీ సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు కురుస్తున్న వానలకు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయాని వరినాట్లు జోరందుకున్నాయాని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంత సాగునీటి లభ్యతపై ఇప్పటికే ఒకసారి సీఎం ఉన్నతస్థాయిలో రెండుసార్లు సమీక్ష చేశారని, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా రైతులకు స్వల్పకాలిక పంటల సాగుపై చైతన్యం చేయాలన్నారు..
స్వల్పకాలిక వరి రకాలపై దృష్టి
శాస్త్రవేత్తల సూచన ప్రకారం కంది, పత్తి పంటలను మరో వారం రోజుల వరకు విత్తుకోవడానికి టైం ఉందని, అలాగే మొక్కజొన్న పంట సాగుకు ఈ వర్షాలు ఈనెలాఖరు వరకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. వరినారు అందుబాటులో ఉన్న రైతులు ఈ అదును నేపథ్యంలో వెంటనే నాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. నేరుగా విత్తుకునే స్వల్పకాలిక వరి రకాలపై దృష్టి సారించాలని, దాని వల్లన పంట ఖర్చులు తగ్గి సాగు కాలం కలిసి వస్తుందన్నారు. అంతేకాకుండా రైతులకు అవసరం అయిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని, నిన్నటి వరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో సాధారణ స్థాయికి వర్షపాతం చేరుకున్నదని, వాతావరణ శాఖ ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Also Read: Custard Apple Varieties: సరి కొత్త రకం సీతాఫలంతో మంచి లాభాలు..

Minister Niranjan Reddy
తెలంగాణలో 32 జిల్లాలలో ఆయిల్ పామ్ లక్ష్యం
తెలంగాణలోని 32 జిల్లాలలో ఆయిల్ పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఏర్పడాయని అన్నారు. ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యమని అన్నారు. గత ఏడాది అధిక వర్షాల కారణంగా ఆయిల్ పామ్ సాగుకు ఆటంకాలు ఏర్పడాయని ఈఏడాది అన్నీ సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే 11 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం పూర్తి అయ్యిందని, 75 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటు కోవడానికి ఆన్ లైన్ ద్వారా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీనికి సంబంధించి రైతులకు అందాల్సిన రాయితీలన్నీ అందుబాటులో ఉన్నాయాని అన్నారు. అంతేకాకుండా ఆయిల్ పామ్ సాగుకు రైతులను అధికారులు మరింత ప్రోత్సహించాలన్నారు. నూతనంగా ఆయిల్ పామ్ సాగుకు ఎంపిక చేసిన జిల్లాలలో ఈవానలకు జిల్లాల నర్సరీల నుండి మొక్కలను తెప్పించి వెంటనే నాట్లు చేయించాలన్నారు. రాష్ట్రంలో ఈఏడాది ఇప్పటికి 65 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు ఆవుతుందని అంచనా వేశారు.
Also Read: Ajwain Cultivation: ఎకరా వాముకు పెట్టుబడి రూ 7 వేలు, లాభం రూ 60 వేలు