Rythu Bandhu Celebrations: తెలంగాణ రైతులకు గొప్ప వరంగా మారింది రైతుబంధు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు (Rythu Bandhu) పథకంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులు అందరూ లబ్ది పొందుతున్నారు. రైతుబంధు పథకం కింద రూ.50వేల కోట్లు రైతులకు నేరుగా అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొనియాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు చేసుకుంటున్నారు రైతన్నలు. రైతుబంధుతో తమకు ఆసరాగా నిలుస్తుందంటూ మహిళలు కెసిఆర్ ముఖచిత్రాన్ని ముగ్గులుగా వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రైతు బంధు సంబరాలు అంబరాన్నంటాయి.
రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో రైతులు, మార్కెట్ కమిటీ భాధ్యులు, అధికారులు రైతుబంధు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో రైతుబంధు లోగోను రూపొందించారు. ఈ సంబరాల్లో భాగంగా సిఎం కెసిఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి అభిమానాన్ని చాటుతున్నారు. పలుచోట్ల రైతులు పొలాల వద్దనే సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేం చేసి తమకు సాయపడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: రైతు బంధు ఓ గేమ్ ఛేంజర్- నిరంజన్ రెడ్డి
కాగా.. సత్తుపల్లి మండలం నారాయణపురంలో రైతుబంధు సంబరాలకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు గొప్పతనం, సీఎం కెసిఆర్ ఉదారతపై అయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా ఎంపీ నామా నాగేశ్వర్ రావు , జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు , ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు.
Also Read: ఏడో రోజు రైతుల ఖాతాలోకి రూ.201.91 కోట్లు