Rythu Bandhu: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రిక రైతుబంధు సొమ్ము జమ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఉన్నపళాన రైతుబంధు ఆగిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తమ ఖాతాలో సొమ్ము జమ కాకపోవడంతో సంబంధిత అధికారులతో గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ స్పందించింది. రైతుబంధు సొమ్ము జమ కాకపోవడానికి కారణాలు ఇవే అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Also Read: రైతు బంధు ఓ గేమ్ ఛేంజర్- నిరంజన్ రెడ్డి
రైతుబంధుపై మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క రైతన్నకు రైతుబంధు అందుతుందన్నారు. ఈ విషయంలో రైతన్నలు ఎలాంటి ఆపోహాలు పెట్టుకోవద్దని చెప్పారు మంత్రి. జనవరి ఒకటవ తారీఖు నుండి ఈ రోజు వరకు మధ్యలో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు వచ్చాయాని, అందుకే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమ చేయడంలో కొంత జాప్యం ఏర్పడిందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాలకు రూ.6008.27 కోట్లు జమచేయడం జరిగింది. ఏడు ఎకరాలు ఉన్న రైతులందరి ఖాతాలకు రైతుబంధు నిధులు జమ అయ్యాయి. అర్హుల జాబితాలో ఉండి మిగిలిపోయిన రైతులందరికీ ఒకటి, రెండు రోజులలో రైతుబంధు నిధులు జమ అవుతాయని క్లారిటీ ఇచ్చారు మంత్రి నిరంజన్ రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది. రైతులకు జమ చేసిన మొత్తం 50 వేల కోట్లకు చేరుకోవడంతో తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు చేసుకుంటున్నారు రైతులు. ఈ సంబరాలను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ సంబరాల్లో పాల్గొంటున్నారు. రంగు రంగుల రంగవల్లులు, అట, పాట, నృత్యాలు, ఎడ్ల బండ్ల ప్రదర్శన, గొబ్బెమ్మల ప్రదర్శనలతో సందడి చేస్తున్నారు. దీంతో తెలంగాణాలో సంక్రాంతి పండుగ శోభా ముందే కనిపిస్తుంది.
Also Read: ఖమ్మం రైతు బంధు సంబరాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి