Innovating in Education for India to be a Global Leader: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 8వ వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబర్ 3వ తేదీన జరగనుంది. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియం లోనూ, రాష్ట్రంలోని అన్ని కళాశాలలు, పాలిటెక్నిక్ లు, పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలలో దీనిని నిర్వహించనున్నారు. ఆడిటోరియం లో జరిగే కార్యక్రమం లో హైదరాబాద్ IIT డైరెక్టర్ ప్రొఫెసర్ బి. ఎస్. మూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని “ఇన్నోవేటింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియా టూ బీ ఏ గ్లోబల్ లీడర్”(“Innovating in Education for India to be a Global Leader”) అన్న అంశంపై ప్రసంగించనున్నారు.
Also Read: PJTSAU Diploma 2022: డిప్లోమా కోర్సులకు ఆన్ లైన్ దరఖాస్తు గడువు పొడగింపు.!
ACP& వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇంచార్జి ఉపకులపతి M. రఘునందన్ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. పూర్వ ఉపకులపతులు, వర్సిటీ అకాడమిక్ కౌన్సిల్, బోర్డు సభ్యులు, రైతులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా 10 మంది టీచర్లకు, 16 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి, 13 మంది రైతులకి, 4 సంస్థలకి, ముగ్గురు పీజీ విద్యార్థులకి, ఒక పాలిటెక్నిక్ విద్యార్థికి, అగ్రి హబ్ తరపున మరో 8 మందికి అవార్డులు ఇవ్వనున్నారు.
Also Read: PJTSAU: పిజెటిఎస్ ఎయూలో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ కార్యక్రమం.!
Also Read: PJTSAU Vice-Chancellor Retirement: పిజె టిఎస్ ఎయూ ఉపకులపతి పదవీ విరమణ.!
Also Read: PJTSAU: పిజె టిఎస్ ఎయూ లో ఘనంగా జె ఫార్మ్ అండ్ ప్రొడక్ట్ ట్రైనింగ్ సెంటర్” ప్రారంభం.!